Breaking News

ఇంటికో పారిశ్రామికవేత్త తయారీకి సమన్వయంతో పనిచేయాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త సాధనకు స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు, మేనేజర్లతో రెండు రోజులపాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన వర్క్ షాప్ కు మంత్రి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాల వారీగా ఋణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలు మరియు గ్రామ సంఘాల ఆర్థిక దావాదేవీలను ఎప్పటికప్పుడు నమోదు చేసే విధంగా సమగ్రంగా పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సంఘాల పుస్తకాలను అంతర్గత ఆడిట్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బోగస్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని బ్యాంకు నుండి అక్రమంగా రుణాలు పొందడాన్ని పూర్తిగా నివారించాలని అన్నారు. ఎన్ ఆర్ ఎల్ ఎం ఐడి ఉన్న గ్రూపులకే బ్యాంకు రుణాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. స్త్రీనిధి రుణాలు నూటికి నూరు శాతం వసులయ్యే విధంగా పథక సంచాలకులు చర్యలు తీసుకోవాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి సూచించిన విధంగా ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త సాధనకు ప్రతి సీసీ మరియు ఎపిఎంలు స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని నిర్దేశించారు. ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే క్రమంలో సంఘ సభ్యులకు కావలసిన సాంకేతికపరమైన శిక్షణ, వ్యాపార సంస్థల నిర్వహణలో మెలుకువలు, మార్కెటింగ్ లింకేజ్ ఏర్పాటు పై జిల్లాస్థాయిలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థలు అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం ఏర్పాటు చేసుకొని సేవలందించాలని మంత్రి కోరారు. సభ్యుల జీవనోపాదుల మెరుగుదలకు ఇప్పటికే ఖైతీ, నాబార్డ్, ఉబయ్ ఆక్వా, బుజ్వర్తీ ఫౌండేషన్, ఫ్లిప్ కార్ట్, వృత్తి, క్యాపిటలిస్ట్ మేనేజ్మెంట్ సర్వీస్, ఫామ్ వేద వంటి సంస్థలతో ఇప్పటికే ఎంఓయులు చేసుకున్నామని, వారి ద్వారా వివిధ రంగాల్లో జీవనోపాదుల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రత్యేకంగా విజిలెన్స్ వింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా సెర్ఫ్ సీఈవో కు సూచించారు. సీవీడ్ కల్టివేషన్, హేలో పైలేట్స్ సాగుకు సంబందిత సాంకేతిక పరిజ్ఞానాన్ని జాతీయ ఉప్పు, సముద్ర రసాయనాల పరిశోధన సంస్థ సహకారం తీసుకోవాలని, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన ఉప్పు తయారీకి చర్యలు చేపట్టడం ద్వారా సముద్ర ఒడ్డు గ్రామాల్లోని జాలర్ల జీవనోపాదుల పెంచే అంశంపై చర్చించారు. గత 25 సంవత్సరాలుగా సంస్థాగత నిర్మాణం మరియు సభ్యుల సామర్ధ్యాల పెంపుకు సెర్ఫ్ కృషి చేసిందని ఇకపై గౌరవ ముఖ్యమంత్రి సూచించిన విధంగా సభ్యుల జీవనోపాదుల మెరుగుదలకు కృషి చేయాలని, పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దడం కోసం ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో సెర్ఫ్ సీఈవో వాకాటి కరుణ, చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, జాతీయ ఉప్పు, సముద్ర రసాయనాల పరిశోధన సంస్థ సంచాలకులు కన్నన్ శ్రీనివాస్, సెర్ఫ్ అదనపు సీఈఓ శ్రీరాములు నాయుడు, డైరక్టర్లు, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *