Breaking News

జీరో పావర్టీ-పి4 ప్రారంభ సన్నాహాలను సమీక్షించిన ముఖ్యమంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 30న ఉగాది నాడు ప్రారంభించనున్న జీరో పావర్టీ-పి4 (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్‌షిప్) కార్యక్రమం సన్నాహకాలను గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. స్వర్ణ ఆంధ్ర@ విజన్ 2047 మరియు పదిసూత్రాల కార్యాచరణ అమలులో భాగంగా,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘జీరో పావర్టీ-పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్నర్షిప్ (పి4)’ కు రూపకల్పన చేస్తోంది.దీని ద్వారా ప్రజలు ఆర్థిక అభివృద్ధిలో క్రియాశీలక భాగస్వాములుగా మరియు ప్రత్యక్ష లబ్ధిదారులుగా చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.

జీరో పావర్టీ – పి4 భాగంగా, తెలుగు సమాజంలో పై స్థాయిలో ఉన్న 10% (ఆర్థికంగా సంపన్నమైన కుటుంబాలు) మరియు విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు, దిగువస్థాయిలో ఉన్న 20% (పేద కుటుంబాలకు)సహాయం, మార్గదర్శకత్వం అందించేలా మార్గాలను అన్వేషిస్తుంది.దీని ద్వారా రాష్ట్రంలోని పేదరికాన్ని నిర్మూలించడం మరియు స్వర్ణ ఆంధ్ర అసలు విజన్ సాకారం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సమావేశంలో, జీరో పావర్టీ – పి4 సర్వే మరియు సంప్రదింపుల పురోగతిని సియం సమగ్రంగా పరిశీలించారు, ఈ కార్యక్రమంలో గరిష్ట పౌర భాగస్వామ్యం ఉండేలా చూసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.మహిళలు మరియు గ్రామీణ ప్రాంతాల నుండి పౌరుల అధిక స్థాయి భాగస్వామ్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. జీరో పావర్టీ – పి4 వంటి పరివర్తన విధానాలను రూపొందించేటప్పుడు పౌర సంప్రదింపులు మరియు పారదర్శకత ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పి4 సంప్రదింపులలో పాల్గొని తమ విలువైన సూచనలు మరియు అభిప్రాయాలను అందించాలని సియం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ ప్రణాళికలో భాగంగా, ఆయన దీర్ఘకాలికంగా జీరో పావర్టీ – పి4 కార్యక్రమం నడవడానికి బాధ్యతాయుతమైన సొసైటీని ఏర్పాటు చేయడం గురించి ప్రభుత్వ వ్యూహాన్ని వివరించారు. పి4 సొసైటీని రాష్ట్ర వ్యాప్తంగా అనుబంధ చాప్టర్లతో మరియు ప్రైవేట్ రంగం యొక్క క్రియాశీల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉగాది రోజు ప్రారంభించనున్న జీరో పావర్టీ-పి4 ప్రారంభోత్సవానికి సమగ్ర సన్నాహాలు మరియు పౌర భాగస్వామ్యాన్ని నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *