Breaking News

గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఇఫ్తార్ విందు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయంలో రంజాన్ సందర్భంగా శుక్రవారం ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. తొలుత మత పెద్దలు దువా (ప్రార్ధన) నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రంజాన్ పండుగ ప్రతి ఒక్కర కుటుంబాల్లో ఆనందం నింపాలని కోరుకుంటున్నామన్నారు. రంజాన్ మాసంలో నగరంలోని ప్రతి మసీదు వద్ద ప్రత్యేక పారిశుధ్య పనులు, త్రాగునీటి సదుపాయం, వీధి దీపాల ఏర్పాటు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చాలా కాలం అనంతరం జిఎంసి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామని తెలిపారు. తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు నసీర్ అహ్మద్ మాట్లాడుతూ సుధీర్గ కాలం తర్వాత జిఎంసి ఆధ్వరంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన నగర కమిషనర్ కు ధన్యవాదాలన్నారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమన్నారు. సంక్రాంతి సంబరాలు, సెమి క్రిస్టమస్, ఇఫ్తార్ విందుల నిర్వహణ ద్వారా జిఎంసి ప్రతి ఒక్కరీ మనోభావాలను గౌరవిస్తుందన్నారు. రాష్ట్రంలో కూటమి పాలన ప్రజారంజకంగా జరుగుతుందన్నారు. గుంటూరు నగరాన్ని సుందరంగా, అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గల్లా మాధవి మాట్లాడుతూ శాంతికి, సహనానికి రంజాన్ మాసం ప్రతీకన్నారు. గత దుష్ట పాలన నుండి మంచి పాలనలోకి వచ్చామని, నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి ప్రాంతం సమగ్రమైన అభివృద్ధి జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో ఏపిఐడిసి చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపి ఎల్ఐడిసి చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, ఏపిటిఎస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ, టిడిపి ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంధ్ర, జిఎంసి అదనపు కమిషనర్ చళ్ళా ఓబులేసు, అధికారులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *