రైతులకు అధిక దిగుబడులను సాధించేలా సాంకేతిక సహకారాన్ని అందిస్తూన్నాం

-రైతుల ఆర్థిక అభివృద్ధికి అవసరమైన సూచనలతో సహకరిస్తున్నాం
-ఉద్యాన పరిశోధన కేంద్రంలో ఘనంగా కిసాన్ మేళా
-డాక్టర్ వైయస్సార్హెచ్యు వైస్ చాన్సలర్ డాక్టర్ కే .గోపాల్
-కొవ్వూరు శాసన సభ్యులు, ముప్పిడి వెంకటే శ్వర రావు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ర్టంలో రైతులకు అధిక దిగుబడులను సాధించేలా సాంకేతిక సహకారాన్ని అందిస్తూ, వారి ఆర్థిక అభివృద్ధికి సహకరిస్తున్నామని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం స్థానిక డాక్టర్ వైయస్సార్ హెచ్ యు ఉద్యాన పరిశోధన స్థానంలో కిసాన్ మేళా కార్యక్రమంలో శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఉద్యాన పరిశోధన స్థానం వైస్ ఛాన్స్ లర్, డాక్టర్ కే గోపాల్ ముందుగా వ్యవసాయ ప్రదర్శన కేంద్రాలను ప్రారంభించి, జ్యోతి ప్రజ్వలన చేసి కిసాన్ మేళా ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులను ప్రోత్సహించి అధిక దిగుబడులను, అదనపు ఆదాయం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆమేరకు మరిన్ని ఆవిష్కరణ లకు నాంది పలకాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, లాభసాటిగా ఉండేలా దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించడానికి అనేక నూతన ఆవిష్కరణలు చేపట్టల్సిన అవసరం ఉందన్నారు.

రైతులకు సాంకేతిక సహాయం అందించడం, ప్రకృతి వ్యవసాయం పద్ధతులను ప్రోత్సహించడం, వివిధ పంటలపై అవగాహన పెంచ డం ద్వారా మానవ ఆరోగ్యా న్ని కాపాడుకోవచ్చ అన్నారు. రైతులకు మరింత ఉపయోగకరంగా ఉండే విధంగా, సంబంధిత శాస్త్రవేత్తలు, అధికారుల ద్వారా రైతులకు అవగాహన కనిపిస్తున్నామని తెలిపారు. తగిన మోతాదులో పరిమితి కి లోబడి ఎరువులు, సాంకేతిక పరికరాలు సరిపడగా ఉపయోగించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు,పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించడం, ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచడం లో ప్రాధాన్యత ఇచ్చి రైతులను ప్రోత్సహించడం జరుగుతోందని తెలిపారు. వ్యవసాయం వైపు వెళ్లేటట్టు విధంగా మనం రైతులకు సరైనటువంటి సలహాలు సూచన లు ఇచ్చినట్లయితే రైతుల ఆర్థికంగా బలపడతారని సూచించారు. రైతు దేశానికి వెన్నుముక అని , ప్రతి ఒక్కరూ కూడా మనం ఆహారం తీసుకుని బ్రతకాలి కాబట్టి ఆహారం పండించేది రైతు కాబట్టి రైతు యొక్క యోగక్షేమాలు కూడా చూసు కోవాలన్నారు. శాస్త్రవేత్తలు, నిపుణులు, ఆదర్శ రైతులతో వ్యవసాయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేటట్లుగా రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి మార్గదర్శకం మేరకు ఎరువులు గాని, విత్తనాల గాని ఇవ్వడం జరుగుతోందని వెల్లడించారు . రైతులు పంటలు పండించేందుకు కావలసినటు వంటి సాంకేతిక వ్యవసాయ పరికరాలు సబ్సిడీ పై ఇవ్వడం జరుగుతొందన్నారు.

అగ్రికల్చర్ సంభం దించిన పరికరాలు, రైతులందరికి ఇవ్వడం, వనరులను సద్వినియోగం చేసుకునే విధానంలో ఇతర పంటలు పండించుకోవడానికి వ్యవసాయం సంబంధించిన రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు రాయితీపై ఇవ్వడం జరుగు తొందన్నారు.

ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ కే గోపాల్, మాట్లాడుతూ డా॥ వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వ విద్యాలయము పరిధిలో గల ఉద్యాన పరిశోధన స్థానము, కొవ్వూరు గత 6 దశాబ్దాలుగా అరటిలో గణనీయమైన పరిశోధనలు చేసి సాంకేతిక పరిజ్ఞా నాన్ని రైతులకు అందించడం లో విశేష కృషి చేసి మన రాష్ట్రంలో అరటి ఉత్పత్తి పెరగ డానికి దోహద పడిందన్నారు. ఈ పరిశోధనా స్థానం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింద న్నారు. ఈ పరిశోధన స్థానంలో విత్తన పిలక ఎంపిక దగ్గర నుం డి వివిధ యాజమాన్య పద్ధతు లైన సమగ్ర ఎరువులు, నీటి యాజమాన్యం, సస్యరక్షణ యాజమాన్యం, సేంద్రియ వ్యవసాయం, కోత అనంతర పరిజ్ఞానం వంటి విషయాలపై సమగ్ర సమాచారాన్ని రైతులకు అందించడమే కాకుండా టిష్యూక ల్చర్ అరటి మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకు నాణ్యమైన మొక్కలను సరఫరా చేయడం లో ముఖ్య పాత్ర పోషిస్తున్నదన్నారు. మన రాష్ట్రంలో టిష్యూకల్చర్ అరటి మొక్కలను అందించే సంస్థలలో ఈ పరిశోధన సంస్థ ఒక్కటే ప్రభుత్వ రంగ సంస్థ అని పేర్కొన్నారు. ఈ పరిశోధన కేంద్రంలో మిగిలిన సాంప్రదాయ రకములైన తెల్ల చక్కెర కేళి, కర్పూర, ఎర్ర చక్కెర కేళి, మార్టమన్, కొవ్వూరు బొంత, గోదావరి బొంత వంటి పలు రకాలతో పాటు ఇతర జాతీయ స్థాయిలో విడుదలైన కావేరి కల్కి, పోపొవులు, ఫియా-3 వంటి అరటి రకాలలో కూడా టిష్యూ కల్చర్ మొక్కలను వృద్ధిచేసి రైతుల అవసరాలను బట్టి అందించడం జరిగిందన్నారు.

ఈ పరిశోధనా స్థానం ద్వారా ఇప్పటి వరకు 13 లక్షల పై చిలుకు టిష్యూకల్చర్ అరటి మొక్కలను రైతులకు సరఫరా చేయడం జరిగిందన్నారు.

ఈ పరిశోధనా స్థానం నుండి విడుదలైన కొవ్వూరు బొంత మరియు గోదావరి బొంత అనే కూర అరటి రకాలు మిక్కిలి ప్రాచుర్యం పొంది సాగులో ఉన్నవన్నారు. ఈ పరిశోధనా స్థానం నుండి దుంప పంటల లో గజేంద్ర అనే తీపి కందరకం, భావపురి, గోదావరి చేమ అనే చేమ రకాలు, శబరి అనే పెండ లం రకం విడుదల చేయబడ్డా యన్నారు.

ఈ పరిశోధనా స్థానం నుండి నాణ్యమైన టిష్యూకల్చర్ అరటి మొక్కలు రాష్ట్రవ్యాప్తం గా రైతులకు అందించబడు చున్నవన్నారు. అరటి ఉత్ప త్తిలో మన రాష్ట్రం దేశం లోనే ప్రధమ స్థానాన్ని కైవసం చేసు కుందన్నారు. ఇటీవల కాలం లో మన రాష్ట్రంలో అరటి సా గు గణనీయంగా పెరగడానికి గల ముఖ్య కారణం టిష్యూ కల్చర్ మొక్కలు అందుబాటు లోకి రావడం మరియు మేలైన యాజమాన్య మెళకువలను ఆచరించడమేనన్నారు.

ఈ కార్యక్రమంలో ఉద్యానవన పరిశోధన స్థానం డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ టెన్షన్ బి. గోవింద రాజులు, ఉద్యానవన పరిశోధన స్థానం కొవ్వూరు ప్రిన్సిపల్ సైంటిస్ట్, పి. లలితా కామేశ్వరి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డి . వెంకట స్వామి, సైంటిస్ట్, ఏ. స్నేహలత రాణి, త్రిసభ్య కమిటీ సభ్యులు, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ, ఎంపీపీ, కాకర్ల సత్య నారాయణ, జడ్పిటిసి, బి. వెంక టలక్ష్మి, మద్ది పాటి శివరామ కృష్ణ, సాయిన రామకృష్ణ, సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్, పిల్లలమర్రి మురళీకృష్ణ, అక్షయపాత్ర రవీంద్ర, కూటమి నాయకులు, ప్రకృతి వ్య వసాయ సిబ్బంది జె.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *