పన్ను చెల్లించని వారిపై చర్యలు తీసుకొంటాం , అత్యవసర సేవలను నిలిపివేయడం జరుగుతుంది

-పన్నులు చెల్లించి మౌలిక సదుపాయాల కల్పన కు, సక్రమ నిర్వహణకు సహకరించండి
-ఆస్తిపన్ను బకాయిలు రూ.10 కోట్లు, నీటి చార్జీల బకాయిలు రూ.2 కోట్లు
-నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు పన్ను చెల్లింపుదారులు చెల్లించాల్సిన పన్నులు, పన్నేతరములను వెంటనే చెల్లించి నగరాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని మునిసిపల్ కమిషనరు కేతన్ గార్గ్ కోరారు.

ఆదివారం ఉదయం ఆర్ ఎమ్ సి అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందికి టేలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేతన గార్గ్ ఆదేశాలు జారీ చేస్తూ, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరము వారం రోజులలో ముగియుచున్నందున పన్నులు , పన్నేతరములు వసూళ్ళు వేగవంతం చేసి లక్ష్యాలను పూర్తి చేయాలని , ఆమేరకు రెవెన్యూ విభాగపు అధికారులను రోజూ వారి లక్ష్యాలని సిద్ధం చేసుకోవాలన్నారు. పన్నుల వసూళ్ళ ప్రగతిపై డిప్యూటి కమిషనరు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, పరిపాలనా కార్యదర్శులకు సూచనలు చేశారు. వసూళ్ళను సమీక్షిస్తూ యిప్పటివరకు ఆస్థిపన్ను రూపేణా రూ.60.71 కోట్లు చేసారని, యింకా సుమారు రూ.10.00 కోట్లు దాకా వసూలు చేయాల్సివుందన్నారు. వెంటనే సదరు మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించారు. నీటి చార్జీలు కూడా రూ.2.00 కోట్లు మేర వసూలు చెయ్యాల్సి ఉందన్నారు. బకాయిలు వున్న వారికి నోటీసులు యివ్వాలని పన్ను చెల్లించని వారి యిళ్ళ యొక్క అత్యవసర సర్వీసులైన కుళాయి, కరంటు కనెక్షన్లు తొలగించాలని ఆదేశించారు. నిన్నటి రోజున 10 కరంటు కనెక్షన్లు కూడా తొలగించామని అన్నారు. ఉగాది, రంజాను సందర్భముగా ది.30-03-2025 మరియు 31-03-2025 వ తేదీలు వరుసగా శెలవులు వచ్చినందున వసూళ్ళు ది.29-03-2025 వ తేదీలోగా పూర్తి చేయాలని అన్నారు. ఈ విషయం ప్రజలకు తెలియచేసి వారికి అవగాహన కల్పించాలని , నగర అభివృద్ధిలో అన్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బందికి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయకుండా అలక్ష్యం చూపిస్తే క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ టెలికాన్ఫరెన్సులో డిప్యూటి కమిషనరు ఎస్.వి.రమణ, రెవెన్యూ అధికారులు కె.బి.ఆర్.రవికుమార్ , సిహెచ్.శ్రీనివాసరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, పరిపాలనా కార్యదర్శులు తదితరములు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *