Breaking News

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖను బలోపేతం చేసి ప్రాధమిక దశలోనే వ్యాధులను గుర్తించి నాణ్యమైన వైద్యసేవలను అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబసంక్షేమ, వైద్యావిద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ఆదివారం గుంటూరు వైద్య కళాశాలలోని జింకానా ఆడిటోరియంలో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి కార్డియాక్ మరియు కార్డియోథెరసిక్ విభాగంలో 100 సీఏబీజీఎస్ ప్రోసిజర్లు, 25000 క్యాథ్లాబ్ ప్రోసిజర్లు, 5000 పీటీసీఏ లు విజయవంతంగా పూర్తి చేసినందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, శాసనసభ్యులు , మాజీ మంత్రి డా. కామినేని శ్రీనివాస్, కార్డియోథోరాసిక్ మరియు వాస్కులర్ సర్జన్ , హర్ట్, లంగ్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ పద్మశ్రీ డా. ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే, ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షులు నంద కిషార్ తో కలసి పాల్గొన్నారు. రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబసంక్షేమ, వైద్యావిద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని కార్డియాక్ మరియు కార్డియోథెరిసిక్ విభాగం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఆదర్శంగా తీసుకునేలా 600 బైపాస్ సర్జరీలు, మూడు గుండె మార్పిడి సర్జరీలు చేయటంలో బాగస్వాములైన వైద్యులను ఇతర సిబ్బందిని ప్రత్యేక అబినందిస్తున్నామన్నారు. దీనికి కార్డియోథోరాసిక్ మరియు వాస్కులర్ సర్జన్ , హర్ట్, లంగ్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ పద్మశ్రీ డా. ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే 2015 మార్చి 18వ తేది పీపీపీ పద్ధతిలో జీజీహెచ్ లో కార్డియాక్ సర్జరీ ప్రారంభించటమే స్పూర్తి అన్నారు. సమాజానికి తనవంతుగా ఎంతో కోంత సేవా చేయాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వ వైద్యాశాలలో డా. ఆళ్ళ గోపాల కృష్ణ గోఖలే వైద్యసేవలు ఉచితంగా అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారంతో అవసరమైన అన్ని కార్యక్రమాలను నిర్వహించటం జరుగుతుందన్నారు. ప్రస్తుత జీవనశైలి, ఆహార అలవాట్లు ఒత్తిడితో చాలా బీపీ, షుగర్, గుండెజబ్బుల వ్యాధులకు గురి అవుతున్నారన్నారు. ఇంటింటికి వెళ్ళి స్క్రీనింగ్ ద్వారా గుండెజబ్బులు, కాన్సర్ వ్యాధులను ప్రాధమిక స్థాయిలో గుర్తించి మెరుగైన వైద్యసేవలను అందించటం జరుగుతుందన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలను బలోపేతం చేయటంతో పాటు, గతంలో నిర్మాణాలు పెండింగ్ లో ఉన్న అభివృద్ది పనులు పూర్తి చేయటం జరుగుతుందన్నారు. గుండెజబ్బులతో ప్రజలు మృతి చెందకూడదని గుండెపోటు వచ్చిన వారికి గోల్డెన్ అవర్ ఇవ్వాల్సిన రూ.40వేల ఖరీదైన ఇంజక్షన్ ను అన్ని ప్రాధమిక వైద్యశాలలోను అందుబాటులో ఉంచి ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ ఇంజక్షన్లు ఇప్పటి వరకు రాష్ట్రంలో 2236 మందికి ఇవ్వగా 2224 మందికి ప్రాణాలు కాపాడటం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రులలో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అపరేషన్లు చేస్తున్నామన్నారు. అర్గన్ డోనేషన్ పై ప్రభుత్వం విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలలో, సూపర్ స్పెషాల్టీ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయటం జరుగుతుందన్నారు. ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే ప్రజలకు వైద్యులు సేవాభావంతో వైద్య సేవలు అందించాలన్నారు.

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం టీ కృష్ణబాబు మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలలో అత్యధునిక వైద్యసేవలు మెరుగ్గా అందుతున్నాయన్న భరోసా కల్పించేలా జీజీహెచ్ లోని గుండెజబ్భుల విభాగం వైద్యులు అందించిన సేవలకు గాను ఐఎంఏ సన్మాన కార్యక్రమం నిర్వహించటం అబినందనీయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నా లక్ష్యంతో రాష్ట్రంలోని 17 వైద్యకళాశాల ఆసుపత్రులలోను కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, అంకాలజీ తదితర సూపర్ స్పెషాలిటీలు విభాగాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రభుత్వ వైద్యశాలల అభివృద్ధికి రాష్ట్ర నిధులతో పాటు, కేంద్ర నిధులు తీసుకువస్తున్నారన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ విధ్యార్ధులతో పాటు, నగరంలోని ప్రముఖుల ఆర్ధిక సహాయంతో ఆసుపత్రికి అవసరమైన అత్యధునిక మౌలిక సౌకర్యాలు కల్పించటం జరుగుతుందన్నారు. వైద్యవిద్య చాలా ఖరీదైనది దీని కోసం ప్రభుత్వం సంవత్సరానికి రూ.12000 కోట్లు వరకు ఖర్చు చేస్తుందని, వైద్యులు సేవాభావంతో వైద్యసేవలు అందించాలన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ రానున్న ఐదు సంవత్సరాల్లో 75.000 ఎంబీబీఎస్ సీట్లు, 75,000 పీజీ సీట్లు దేశంలో అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించినందున, భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లోను వైద్యులు అందుబాటులోకి వస్తారన్నారు. సమావేశంలో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలలో నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు.

రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, శాసనసభ్యులు , మాజీ మంత్రి డా. కామినేని శ్రీనివాస్, కార్డియోథోరాసిక్ మరియు వాస్కులర్ సర్జన్ , హర్ట్, లంగ్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ పద్మశ్రీ డా. ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే, ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షులు నంద కిషార్ జీజీహెచ్ కార్డియాక్ మరియు కార్డియోథెరసిక్ విభాగాధిపతి డా. హరికృష్ణ మూర్తి, అనస్తీయా విభాగాధిపతి డా. పోలయ్య, సీటీవీఎస్ విభాగం వైద్యులు, నర్సింగ్, ఇతర సిబ్బందిని ఘనంగా సన్మానించారు.
సమావేశంలో గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. సుందరాచారి, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రమణ యశస్వీ, ఐఎంఏ గుంటూరు జిల్లా అధ్యక్షులు వై సుబ్యారాయుడు, సెక్రటరీ డా. సాయి కృష్ణ, వైస్ ప్రసిడెంట్ డా. అమరలింగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ డా. రాధికా రాణి చంద్రా, వైద్యావిధ్యార్దుల, నర్సింగ్ విధ్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *