Breaking News

రబీ ధాన్యం కొనుగోలుపై శిక్షణ కార్యక్రమాలు..

-జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ ఏడాది రబీ సీజన్‌ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ళు పై ఈ నెల 25 నుండి 27వ తేదీ వరకు డివిజన్‌ మండల స్థాయిలో సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ అధికారులను అదేశించారు. రైతులకు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను చెల్లించి ధాన్యం కొనుగోళ్ళు చేసే విధంగా జిల్లాలోని తిరువూరు, నందిగామ, మైలవరం, విజయవాడ డివిజన్‌ స్థాయిలో రైతు సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కె) సేకరణ సహాయక సిబ్బంది (పిఎస్‌ఏ)కి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. శిక్షణ లో భాగంగా ఈనెల 25వ తేదీ మంగళవారం తిరువూరు డివిజన్‌ పరిధిలోని ఏ కొండూరు, గంపలగూడెం, తిరువూరు, రెడ్డిగూడెం, విస్సన్నపేట మండలాల 41 రైతు సేవా కేంద్రాల పరిధిలోని సిబ్బందికి తిరువూరు వాహిని కళాశాలలోను, 26వ తేదీన నందిగామ డివిజన్‌ పరిధిలోని జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, నందిగామ, వత్సవాయి, చంద్రలపాడు, వీరులపాడు మండలాల 41 రైతు సేవా కేంద్రాల పరిధిలోని సిబ్బందికి నందిగామ కెవిఆర్‌ కళాశాలలోను 27వ తేదీన విజయవాడ డివిజన్‌ పరిధిలో విజయవాడ రూరల్‌, నార్త్‌, ఇబ్రహీంపట్నం జి. కొండూరు, మైలవరం మండలాల 25 రైతు సేవా కేంద్రాల పరిధిలోని సిబ్బందికి మైలవరం లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ కళాశాల నందు ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణలో ఆయా క్లస్టర్ల రైతు సేవా కేంద్రాల టెక్నికల్‌ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఇన్‌చార్జ్‌లు పాల్గొనాలని కలెక్టర్‌ లక్ష్మీశ ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *