Breaking News

విజయవాడలో రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఇఫ్తార్

-ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు
-రాష్ట్రస్థాయి ఇఫ్తార్ కు రూ. 75 లక్షల ఖర్చు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని రాష్ట్రస్థాయి ఇఫ్తార్ నిర్వహణకు ప్రణాళికాబద్ధమైన, పటిష్టమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు.బుధవారం ఇఫ్తార్ వేదిక ఏ ప్లస్ కన్వెన్షన్ వద్ద మైనారిటీ సంక్షేమ శాఖ సీఈఓ శ్రీధర్ , ఎన్టీఆర్ కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది తదితరులతో రాష్ట్రస్థాయి ఇఫ్తార్ కు సంబంధించి ఏర్పాట్ల విషయంపై మంత్రి ఫరూక్ సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని,ఇందుకోసం రూ.1.50 కోట్లు నిధులను విడుదల చేయడం కూడా జరిగిందని పేర్కొన్నారు.ఈనెల 27వ తేదీన గురువారం విజయవాడలో ఎంజీ రోడ్డులో ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే రాష్ట్రస్థాయి ఇఫ్తార్ ని అధికార యంత్రాంగం, అన్ని ముఖ్య శాఖల సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగి ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ కు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని మంత్రి ఫరూక్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా జిల్లా స్థాయి ఇఫ్తార్ ఏర్పాట్లు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే ఏర్పాట్లకు జిల్లాలకు నిధులను కేటాయించి విడుదల చేయడం జరిగిందన్నారు. మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. ముస్లిం మైనార్టీల కు సంబంధించి గత ప్రభుత్వం నిలిపివేసిన ఇమాములు, మౌజన్ల గౌరవ వేతనంను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందేనని పేర్కొన్నారు. క్రిస్టియన్ మైనార్టీలకు సంబంధించి కూడా పాస్టర్ల వేతనాలకు ప్రభుత్వం ఇటీవల నిధులు విడుదల చేసిందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ తో పాటు అన్ని జిల్లాల్లో నిర్వహించే ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఉన్నత స్థాయి నుంచి క్షేత్రస్థాయిలోని సిబ్బంది వరకు సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి ఫరూక్ సూచించారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *