Breaking News

50% వడ్డీ మాఫీకి కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను చెల్లింపులపై 50 % వడ్డీ మాఫీ కి కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు ఉందన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. పన్ను బకాయల వడ్డీ పై 50% రాయితీ పొందేందుకు మార్చ్ 31, 2025 చివరి తేదీ అని గురువారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో కమిషన్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల 13 క్యాష్ కౌంటర్లు అన్నియును ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయని, నగర పరిధిలోని 286 సచివాలయాల్లోనూ, ప్రతి సచివాలయంలో పన్ను చెల్లింపులకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సచివాలయం సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.  కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇంటి పన్ను ఖాళీ స్థలాల పన్ను బకాయిలు ఉన్నవాళ్లందరూ వడ్డీ పై 50% రాయితీని పొందవచ్చు అని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *