-ఇన్చార్జి మంత్రి మరియు మునిసిపల్ శాఖ మంత్రులు
-శెట్టిపల్లి భూ పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న శెట్టిపల్లి భూ సమస్యల పరిష్కార దిశలో గౌ. ముఖ్యమంత్రి చొరవతో పరిష్కార దిశగా అన్ని చర్యలు చేపట్టామని, వచ్చే ఏప్రిల్ లోపు శెట్టిపల్లి పెండింగ్ లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఒకటిన్నర సెంటు స్థలం కేటాయించి అందిస్తామని, శెట్టిపల్లి భూ పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రులు అనగాని సత్యప్రసాద్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు.
కలెక్టర్ల సదస్సు నేపథ్యంలో విజయవాడలో గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి జిల్లా కలెక్టర్ శెట్టిపల్లి పెండింగ్ అంశాలు తీసుకెళ్లగా, వెంటనే ముఖ్యమంత్రి స్పందించి మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ మరియు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి గారికి, సీసీఎల్ఏ కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి, తిరుపతి జిల్లా కలెక్టర్, తిరుపతి నగరపాలక కమిషనర్ మరియు విసి తుడా లు కలిసి వెంటనే సమన్వయ సమావేశం నిర్వహించి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారని కలెక్టర్ తెలిపారు. ఆ నేపథ్యంలోనే నేడు గురువారం విజయవాడలో జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, సి సి ఎల్ ఏ కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, విసి తుడా ఎన్ మౌర్య లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులకు శెట్టిపల్లి భూ సమస్యల పెండింగ్ అంశాలు, క్లియరెన్స్ కావాల్సిన అంశాలపై జిల్లా కలెక్టర్ పూర్తిగా నివేదించారు. ఈ సందర్భంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మాట్లాడుతూ ఒకటిన్నర సెంటు స్థలం శెట్టిపల్లి పెండింగ్ లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఏప్రిల్ నెల ఆఖరి లోపు కేటాయించాలని ఆదేశించారు. అలాగే ఇతర అంశాలపై క్లియరెన్స్ మరియు రావాల్సిన జీఓ లపై కలెక్టర్ సంబంధిత కార్యదర్శులకు ప్రతిపాదనలు పంపి త్వరితగతిన జీవోలు వచ్చే విధంగా పర్యవేక్షించాలని, సంబంధిత కార్యదర్శులు తదనుగుణంగా పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు.
Prajavartha Online Telugu News