Breaking News

అన్నక్యాంటీన్లలో ప్రభుత్వ నిర్దేశిత సమయంలో ఆహారం అందుబాటులో ఉండేలా చూడాలి… : నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్లలో ప్రభుత్వ నిర్దేశిత సమయంలో ఆహారం అందుబాటులో ఉండేలా చూడాలని, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  అధికారులను, అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. శనివారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ అన్న క్యాంటీన్లలో సమయానుగుణంగా ఆహారం అందించాలన్నారు. అలాగే పేద ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం అందించడానికి ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఆయా క్యాంటీన్ల వద్ద లైట్లు, త్రాగునీటి ఏర్పాట్లు, మొక్కలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏమైనా మరమత్తులు ఉంటే ఎప్పటికప్పుడు చేయాలని, క్యాంటీన్ల పరిశీలనకు నోడల్ అధికారులను కూడా నియమించామని తెలిపారు. అక్షయ పాత్ర సిబ్బంది కూడా క్యాంటీన్ పరిశుభ్రతలో భాధ్యతగా ఉండాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *