Breaking News

30 మరియు 31 తేదీల్లో పన్ను చెల్లింపుల కొరకు తెరిచి ఉంటాయి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలు మార్చి 30 మరియు 31 తేదీల్లో పన్ను చెల్లింపుల కొరకు తెరిచి ఉంటాయి. మార్చి నెల ఆఖరి రెండు రోజులు పన్ను చెల్లింపుదారులు తమ GST, VAT, మరియు ఇతర పన్నులను సకాలంలో చెల్లించుకునేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. పన్ను చెల్లింపుదారులు ఆన్‌లైన్ ద్వారా www.apct.gov.in వెబ్‌సైట్ ద్వారా 24/7 చెల్లింపులు జరిపేందుకు సౌకర్యం కల్పించబడింది. వెబ్‌సైట్‌లో ఇ-పేమెంట్ గేట్ వే ద్వారా పన్ను చెల్లింపులు సులభంగా పూర్తి చేయవచ్చు. అసిస్టెంట్ కమిషనర్లు (ACs) మరియు జాయింట్ కమిషనర్లు (JCs) కార్యాలయాలలో పన్ను చెల్లింపుదారులకు అవసరమైన సహాయం, మార్గదర్శకత, మరియు సందేహ నివృత్తి కోసం అందుబాటులో ఉంటారు. పన్ను చెల్లింపుదారులు తమ పన్ను చెల్లింపులను సకాలంలో పూర్తి చేసుకోవాలని వాణిజ్య పన్నులు శాఖ విజ్ఞప్తి చేస్తోంది. ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఎదురైనపుడు అధికారులను సంప్రదించవలసినది. ఆందువలన వ్యాపారస్తులందరు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయొగించుకుని పన్నులను కట్టవలసినదిగా కొరటమయినది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *