Breaking News

దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదివారం ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు సూపరింటెండెంట్ లక్ష్మణరావు, ఏఈఓ చంద్రశేఖర్ సుజనా కు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితుల చేత ఆశీర్వచనం పొందారు. అనంతరం లడ్డూ ప్రసాదాన్ని , అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు. సుజనా వెంట బీజేపీ నాయకులు మిట్టా వంశీ, అడ్డూరి శ్రీరామ్ , కొత్తపల్లి సుబ్బారాయుడు, చైతన్య శర్మ, పైలా సురేష్, పచ్చిపులుసు ప్రసాద్, అవ్వారు బుల్లబ్బాయి తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *