-పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు.వి. IAS.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం (01.04.2025) సోషల్ స్టడీస్ పరీక్ష యథావిధిగా నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు.వి. IAS., ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుందన్నారు. దీంతో పరీక్ష నిర్వహణకు సంబంధించిన అందరూ అధికారులు ఎలాంటి అపోహలు లేకుండా పరీక్ష సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ విషయాన్ని ఆర్జేడీలు, జిల్లా విద్యాశాఖాధికారులు, సంబంధిత అధికారులు విద్యార్థులు, ఉపాధ్యాయులు & తల్లిదండ్రులకు తెలపాలని కోరారు.
Prajavartha Online Telugu News