Breaking News

ప్రజలు ఇస్తున్న ఆర్జీల్లోని ఫిర్యదులకు సత్వర చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీల్లోని ఫిర్యదులకు సంబంధించి, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ డి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశాల మేరకు సోమవారం కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ బర్త్ అండ్ డెత్ విభాగం వద్ద పిజిఆర్ఎస్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్  తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి 21 ఫిర్యాదులు అందాయన్నారు. డయల్ యువర్ కమిషనర్ కి అందిన ఆర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ చాంబర్ కు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
అనంతరం నగరపాలక సంస్థ బర్త్ అండ్ డెత్ విభాగం వద్ద డి.సి.పి సూరజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమానికి 27 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 10, ఇంజినీరింగ్ విభాగం 6, రెవెన్యూ విభాగం 5, ప్రజారోగ్య విభాగం 5, ఉపా సెల్ విభాగానికి సంబందించి 1 ఫిర్యాదు అందాయన్నారు. పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అందిన ఆర్జీలను విభాగాల వారిగా విబజించి, సంబంధిత విభాగాదిపతులకి పంపి సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, సిపి రాంబాబు, మేనేజర్ బాలాజీ బాష, విభాగాల సూపరింటెండెంట్లు, ఎస్ఎస్ లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *