-50% వడ్డీ మాఫీకి గడువు పెంచిన ప్రభుత్వం
-విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ జి సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను చెల్లింపులపై 50 % వడ్డీ మాఫీ కి ప్రభుత్వం గడువు పెంచిందని ఏప్రిల్ 30, 2025 వరకు 50 శాతం వడ్డీ మాఫీతో ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను చెల్లించేందుకు ప్రభుత్వం మరో అద్భుతమైన అవకాశం కల్పించిందన్నారు విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ జి సృజన . పన్ను బకాయల వడ్డీ పై 50% రాయితీ పొందేందుకు ఏప్రిల్ 30, 2025 చివరి తేదీ అని గురువారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో డిప్యూటీ కమిషన్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల 13 క్యాష్ కౌంటర్లు అన్నియును ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయని, నగర పరిధిలోని 286 సచివాలయాల్లోనూ, ప్రతి సచివాలయంలో పన్ను చెల్లింపులకు సచివాలయం సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇంటి పన్ను ఖాళీ స్థలాల పన్ను బకాయిలు ఉన్నవాళ్లందరూ వడ్డీ పై 50% రాయితీని పొందవచ్చు అని తెలిపారు. వడ్డీ పై 50 శాతం రాయితీ మాత్రమే కాకుండా 2025-2026 సంవత్సరమునకు ముందస్తు పన్ను చెల్లింపులపై ఐదు శాతం రాయితీ కూడా ఉందని, ప్రజలు ప్రభుత్వం వారు కల్పించిన ఈ సదవకాశాన్ని వినియోగించుకొని సత్వరమే పన్ను చెల్లింపులు చేసి నగరాభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు.
Prajavartha Online Telugu News