నియోజక వర్గ రిటర్నింగ్ అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితాల నాణ్యత ,స్వచ్ఛతను మెరుగుపరచడం కోసం పొలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పై నియోజక వర్గ రిటర్నింగ్ అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి తెలియ చేశారు. గురువారం సాయంత్రం డి ఆర్వో ఛాంబర్ లో. అసెంబ్లీ నియోజక వర్గాల ఈ ఆర్ వో లతో, ఇతర సిబ్బంది తో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, జిల్లా ఎన్నికల అధికారి నుంచి బూత్ లెవెల్ అధికారి వరకు ఓటరు జాబితా రూపకల్పనలో అధికారులందరూ పారదర్శకంగా పని చేయాలన్నారు . నియోజక వర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు గా మీపై గురుతరమైన బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఓటరు జాబితా రూపకల్పనలో ఏదైనా ఉద్దేశపూర్వక ఉల్లంఘన జరిగితే, సంబంధిత అధికారిని జవాబుదారీగా చేయాల్సి ఉంటుందని కమిషన్ ఉద్బోధించిందన్న విషయాన్ని వివరించడం జరిగింది. క్లెయిమ్ నిబంధనల ప్రకారం మరియు అదే పేరు మరియు అదే ఇతిహాసం ప్రకారం పరిష్కరించాలన్నారు. ఓటరు నమోదు, తొలగింపు నేపధ్యంలో కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని, తగిన ఆధారాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.

పోలింగ్ బూత్‌ల హేతుబద్ధత కలిగి ఉండేలా 800 నుండి 1200 మంది ఓటర్లు ఉండేలా పోలింగ్ స్టేషన్‌ల సమీక్ష చేపట్టడం, ప్రతి ఓటర్ల నివాసం నుండి 2 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ స్టేషన్‌ల ఉండేలా , వివరణాత్మక కసరత్తును చేపట్టాలన్నారు.

ఈ సమావేశంలో నియోజక వర్గ ఎలెక్టోరల్ రిటర్నింగ్ అధికారులు పి. భాగ్య లక్ష్మి, ఎమ్ ఆర్ ఆర్ ప్రేమ్ కుమార్, డిప్యూటీ తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *