సంక్షేమ వసతి గృహాలను సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీ లక్ష్మీ పట్టణంలోని పలు సంక్షేమ వసతి గృహాలను సందర్శించారు. స్థానిక ఆవా రోడ్డు లో ఉన్న ఏకలవ్య బాలల వసతి గృహం, బొమ్మూరు లో ఉన్న బాలికల శిశుగృహ వసతి గృహం ను సందర్శించి, వసతులను పరిశీలించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వసతి గృహాల సిబ్బందితో మాట్లాడుతూ విద్యార్థులకు సురక్షిత త్రాగు నీరు, మంచి ఆహారం అందించాలనన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వసతి గృహ ప్రాంగణంలో అవసరమైన మరమ్మత్తులను ఎప్పటికప్పుడు చేయించాలని అన్నారు. వారికి ఎలాంటి వైద్య సహాయం అవసరమైన వెంటనే చర్యలు తీసుకోవాలని సిబ్బందితో చెప్పారు. విద్యార్ధులతో మాట్లాడుతూ వసతి గృహములో ఎటువంటి సమస్యలున్నా. ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియ జేయాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *