-163 ప్రాంతాల్లో జీవనోపాధి కేంద్రాల ద్వారా మహిళలకు శిక్షణ,స్వయం ఉపాధి కల్పన
-ఈ ఏడాది పట్టణ ప్రాంతాల్లో 30 వేల మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారుచేయడమే లక్ష్యం
-ఎంఎస్ఎంఈ యూనిట్ల అధ్యయనానికి హైదరాబాద్ లో మంత్రి నారాయణ బృందం పర్యటన
-ప్రగతి నగర్ లో ఎలీప్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ సందర్శన
అమరావతి/హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు సుస్ధిర జీవనోపాధి కల్పించేందుకు ఏపీ మున్సిపల్ శాఖ వేగంగా అడుగులు ముందుకు వేస్తుంది…ఈ ఏడాది రాష్ట్రంలో లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకోగా…పట్టణ ప్రాంతాల్లో 30 వేల మంది మహిళా పారిశ్రామిక వేత్తలను రూపొందించాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారు…దీనికోసం ఏపీ పురపాలక,పట్టణాభివృద్ది శాఖ కొంతకాలంగా అధ్యయనం చేస్తోంది…రాష్ట్రంలోని టిడ్కో గృహాల్లో నివసించే మహిళల ద్వారా ఎంఎస్ ఎంఈ యూనిట్లు నెలకొల్పి వారికి జీవన భృతి కల్పించాలని నిర్ణయించింది.టిడ్కో నివాస సముదాయాల్లో ఖాళీ స్థలాలున్న 163 ప్రాంతాల్లో పట్టణ పేదరిక సంస్థ ద్వారా లైవ్ లీ హుడ్ సెంటర్లను ఏర్పాటుచేస్తున్నారు…ఈ జీవనోపాధి కేంద్రాల్లో(లైవ్ లీ హుడ్ సెంటర్ లు) మహిళలకు వివిధ నైపుణ్యాలకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారితో ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయిస్తారు…అయితే ఎలాంటి యూనిట్లు ఏర్పాటుచేయాలి..ఏయే యూనిట్ల ద్వారా ఎక్కు వ ఆదాయం వస్తుంది,ఎలాంటి సాంకేతిక ఉపయోగించాలనే దానిపై అధ్యయనం చేస్తున్నారు.
మహిళా పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడంలో భాగంగా హైదరాబాద్ లోని ప్రగతినగర్ లో మహిళా పారిశ్రామిక వేత్తల అసోసియేషన్(ఎలీప్)ఆధ్వర్యంలోని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ను సందర్శించింది మంత్రి నారాయణ బృందం…ఈ పర్యటనలో మంత్రి నారాయణతో పాటు మెప్మా,టిడ్కో ఎండీలు,పరిశ్రమల శాఖ అధికారులు ఉన్నారు…ఎంఎస్ ఎంఈ పార్క్ లో ఉన్న స్టార్టప్ కంపెనీలతో పాటు పలు చిన్న,మధ్య తరహా పరిశ్రమలను సందర్శించి వాటి యజమానుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు…ఆయా కంపెనీల ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాల్సిందిగా పరిశ్రమల శాఖ,పురపాలక శాఖ అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు…ఈ పర్యటనలో మంత్రి నారాయణతో పాటు మెప్మా ఎండీ తేజ్ భరత్,పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News