Breaking News

శ్రీ సీతారాముల క‌ల్యాణంలో శ్రీ‌రామ గానామృతంతో మైమ‌రిచిన భ‌క్తులు

ఒంటిమిట్ట, నేటి పత్రిక ప్రజావార్త :
ఒంటిమిట్ట శ్రీ సీతారాముల క‌ల్యాణోత్స‌వం సంద‌ర్భంగా శుక్ర‌వారం సాయంత్రం 5.30 గంట‌ల‌కు బెంగూళూరుకు చెందిన స్ఫూర్తి రావు ఆల‌పించిన శ్రీ‌రామ గానామృతంతో భ‌క్తులు త‌న్మ‌య‌త్వం చెందారు. అంత‌కుముందు తిరుప‌తి ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల విద్యార్థులు ” శ్రీ‌రామ వైభ‌వం ” పై నృత్య రూప‌కం ప్ర‌ద‌ర్శించారు. ఇందలో విశ్వ‌మిత్ర మ‌హ‌ర్షి యాగ ర‌క్ష‌ణార్థం రామ‌ల‌క్ష్మ‌ణుల‌ను అశ్ర‌మానికి తీసుకువెళ్ళ‌డం, అక్క‌డ రాక్ష‌సుల‌ను సంహ‌రించ‌డం ప్ర‌ద‌ర్శించారు. అనంత‌రం సీతా రాముల క‌ల్యాణం కథను చక్కగా భక్తి భావంతో ప్రదర్శించిన తీరు చూపరులను ఆకట్టుకున్నది. ” రామ‌రామ జ‌య రామ‌….” కీర్త‌న‌కు డ‌ప్పు, చ‌క్క భ‌జ‌న‌లతో సాంప్ర‌దాయ జాన‌ప‌ద నృత్యం ఎంతగానో అలరించాయి. అనంత‌రం రాత్రి 8.30 గంట‌ల‌కు శ్రీ‌రామ‌నామ భ‌జ‌నామృతంతో క‌ల్యాణోత్స‌వం ముగిసింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *