Breaking News

ఆదివారం అయిననూ పన్ను చెల్లింపులకు 13 క్యాష్ కౌంటర్లు అందుబాటులో కలవు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం అయిననూ పన్ను చెల్లింపులకు విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో గల 13 కాష్ కౌంటర్లు అందుబాటులో కలవు అని విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటి పన్ను , ఖాళీ స్థలాల పన్ను బకాయిలు ఏక మొత్తంలో చెల్లించినచో వడ్డీ పై 50% రాయితీని పొందవచ్చని, 2025 -26 సంవత్సరముకు గాను ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను ఏక మొత్తంలో చెల్లించినచో 5% రాయితీని పొందవచ్చని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం నగరపాలక సంస్థ పరిధిలో గల 13 క్యాష్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పన్ను చెల్లింపులు చేసుకోగలరని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *