డా. బి.ఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం, వారి జీవితం ఆదర్శనీయం, బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త, భావితరాల దిక్సూచి, భారత రాజ్యాంగ నిర్మాత

-మన రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ గారి స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధికి కట్టుబడి ఉంది: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ & ఎంఎల్ఏ ఆరని శ్రీనివాసులు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
డా. బి.ఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం, వారి జీవితం ఆదర్శనీయం, బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త, భావితరాల దిక్సూచి, భారత రాజ్యాంగ నిర్మాత అని, మన రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధికి కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎంఎల్ఏ ఆరని శ్రీనివాసులు పలువురు వక్తలు పేర్కొన్నారు.

సోమవారం ఉదయం భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్ వద్ద వారి విగ్రహానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, తిరుపతి శాసన సభ్యులు ఆరని శ్రీనివాసులు, తిరుపతి మునిసిపల్ కమిషనర్ శ్రీమతి నారపు రెడ్డి మౌర్య, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, డివిఎంసి సభ్యులు, పలు సంఘాల నాయకులు, తదితరులు పాల్గొని పూల మాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేడు డా. బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించు కుంటున్నామని, శుభాకాంక్షలు తెలిపారు. డా. బి ఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో తాను కూడా ఇన్స్పైర్ అయ్యానని అన్నారు. అంబేద్కర్ గారు విద్యతోనే మంచి మార్పు సాకారం చేయొచ్చు అని నమ్మిన గొప్ప వ్యక్తి అని, నిరుపేద కుటుంబం నుంచి వచ్చినా, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా తాను చదువుకున్న విద్యతో ఎంతో ఉన్నతమైన రాజ్యాంగాన్ని రచించారని, ఆయన స్ఫూర్తితో విద్యార్థినీ విద్యార్థులు విద్యపై దృష్టి పెట్టాలని అన్నారు. విద్యకు ప్రత్యామ్నాయం లేదు అని అన్నారు. మన దేశంలో విభిన్న సంస్కృతులు, భాషలు మతాలు ఉన్నాయని, గొప్ప రాజ్యాంగాన్ని రచించడం అనేది, సమాజానికి మార్గదర్శనంగా రచించడం అనేది ఆయన పలు గ్రంథాలు, పుస్తకాలు చదివి ఎంతో జ్ఞానాన్ని సముపార్జించి ఒక అద్భుతమైన అత్యున్నత రాజ్యాంగాన్ని మన దేశానికి అందించారని, దిక్సూచిగా చిరకాలం రాజ్యాంగం నేటికీ ఎంతగానో మార్గదర్శకంగా ఉందని, అంబేద్కర్ ఒక కులానికి, ఒక మతానికి చెందిన వారు కారని అందరికీ చెందిన వారని తెలిపారు. మన ప్రభుత్వం గడచిన పది నెలల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలో సుమారు 160 పైన ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన సుమారు 25 వేల మంది విద్యార్థినీ విద్యార్థులకు వసతి గృహాల్లో ఇబ్బందులు ఉన్నాయని గుర్తించి సిఎస్ఆర్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ నిధులు 25 కోట్లు రూపాయలు సమీకరించి మంజూరు చేసి అత్యవసర మరమ్మత్తులు, త్రాగు నీరు కిచెన్ షెడ్స్, మరుగుదొడ్లు, ఎలక్ట్రిసిటీ, ఫర్నిచర్ వాటిని రాబోయే వర్షాకాలం లోపు పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన అద్భుత P4 కార్యక్రమం ద్వారా టాప్ లో ఉన్న 10 శాతం మంది అట్టడుగున పేదరికంలో ఉన్న 20 శాతం మందికి చేయూతనిచ్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుదలకు సహకారం అందించడం గొప్ప కార్యక్రమం అని, మన జిల్లాలో P4 కాన్సెప్ట్ కింద వీరిని గుర్తించడం జరిగిందనీ, అందరితో చర్చించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ నిధులు పక్క దారి పట్టకుండా చర్యలు చేపడుతున్నామని, భారత ప్రభుత్వ ఆదర్శ గ్రామ కార్యక్రమంలో రాష్ట్రంలోనే అధికంగా మన జిల్లాలో 175 గ్రామాలను రానున్న ఒక సంవత్సరాలలోపు ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. ఇందులో కూడా ప్రతి ఒక్కరి సూచనలు సలహాలు, సహాయం చాల అవసరం అని అన్నారు. నరేగ కింద అన్ని గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్ లలో స్మశాన వాటికలకు స్థలాలు గుర్తించి ఏర్పాటు, అలాగే వాటికి దారి ఏర్పాటు 100 శాతం శ్యాచురేషన్ మోడ్ లో చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశానుసారం చేపడుతున్నామని అన్నారు. డీఎస్సీ కోచింగ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థినీ విద్యార్థులకు అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఇవ్వడానికి కూడా త్వరలో చేపట్టనున్నామని అన్నారు.1267 యూనిట్లు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లోన్, సబ్సిడీ ద్వారా స్వయం ఉపాధికి లబ్ధిదారులకు పంపిణీకి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పలువురు సూచించిన విధంగా సివిల్ రైట్స్ డే నిర్వహణ మరింత మెరుగ్గా నిర్వహణకు చర్యలు చేపడతామని అన్నారు. గడచిన తొమ్మిది నెలల్లో సుమారు 4 సమావేశాలు నిర్వహించామని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో కంపెన్సేషన్ 90 శాతం అందించడం జరిగిందనీ, ఉద్యోగం కల్పన అనేవి ఎప్పటికప్పుడు చేపడుతున్నామని, 6 గురిలో నలుగురికి ఉద్యోగాలు కల్పించామని, మిగిలిన ఇద్దరికీ త్వరలో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమం మరియు అభివృద్ధి సమపాలల్లో అమలు చేస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పెద్ద ఎత్తున మనం ప్రతి నెల ఒకటో తేదీన లబ్ధిదారులు ఇంటి వద్దనే పెద్ద ఎత్తున పెంచిన మొత్తంతో పింఛన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ఎలాంటి అవినీతికి తావు లేకుండా పంపిణీ చేస్తున్నామని, మన జిల్లాలోనే సుమారు 113 కోట్ల రూపాయల పైచిలుకు పంపిణీ చేస్తూన్నామని, దేశంలోనే ఎక్కువ మొత్తం పింఛన్లను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోందని అన్నారు. మండలాల్లో కమ్యూనిటీ భవనాలకు స్థలాల గుర్తింపు కోసం ఆర్డీఓ లకు, తహశీల్దార్లకు ఆదేశాలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. అంబేద్కర్ గారి స్ఫూర్తితో అందరం కలిసి పని చేద్దామని కోరారు.

ఎంఎల్ఏ మాట్లాడుతూ డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ఘనంగా ఏర్పాట్లు చేసారని కొనియాడారు. గత ప్రభుత్వంలో సంక్షేమ వసతి గృహాలు నిర్లక్ష్యం చేయబడ్డాయని, సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగిందని, అవసరమైన అదనపు నిధులను సమీకరించి మన జిల్లా కలెక్టర్ గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల మరమ్మత్తులకు చర్యలు చేపట్టారని, కలెక్టర్ కు బడుగు బలహీనర్గాలపై ఎంతో మమకారం ఉందని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్. అంబేద్కర్ చేసిన మార్గదర్శనం, రాజ్యాంగం దిక్సూచిగా చిరకాలం గుర్తుంచుకోవాల్సినవని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, ప్రధాన మంత్రి రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమం కింద సుమారు 100 కోట్లు రూపాయలు విడుదల చేసి గ్రామీణ ప్రాంతాలలో సీసీ రోడ్లు, మౌలిక వసతుల కల్పనలో ఎస్సీ ఎస్టీ కాలనీలు, గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధికి సమపాళ్లలో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. డా.బిఆర్. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి సేవలు చిరస్మరణీయం అని, జై భీం అని నినదించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంబేద్కర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్నారని, బడుగు బలహీనర్గాల సంక్షేమం అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.

యాదవ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ స్ఫూర్తితో మనం అందరం నడుచుకోవాలని, ఆయన ఆశయాలకు మనమందరం పునరంకితం అవుదాం అని పిలునిచ్చారు. ఎస్సీ ఎస్టీలు, బీసీ లు తదితర బడుగు బలహీనర్గాల సంక్షేమం కొరకు అంబేద్కర్ కృషి చేశారని, అంబేద్కర్ అందరివాడు అని పేర్కొన్నారు. పలు పెండింగ్ భవనాలను త్వరిత గతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరారు.

పరస రత్నం మాజీ మంత్రి, మాజీ ఎంఎల్ఏ, డిప్యూటీ మేయర్ మునికృష్ణ, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ, స్టేట్ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ స్రవంతి తదితరులు మాట్లాడుతూ డా. బిఆర్. అంబేద్కర్ అందరికీ ఆదర్శనీయులు అని, భారత రాజ్యాంగం నిర్మాతగా దిక్సూచిగా మార్గదర్శనం చేశారని, అంటరానితనం నిర్మూలనకు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టళ్ల మరమ్మత్తులకు పెద్ద ఎత్తున నిధులు సమీకరించి వాటిని మరమ్మత్తులు చేయించిన కలెక్టర్ స్ఫూర్తిదాయకులు అని కొనియాడారు. ఎస్సీ భవన్ ఏర్పాటు కొరకు పలువురు కోరారు.

పలువురు సంఘాలు నాయకులు బాబా సాహెబ్ అంబేద్కర్ ని స్మరించుకుంటూ మంచి సందేశం అందించారు.

కార్యక్రమ ప్రారంభానికి ముందు రక్తదాన శిబిరాన్ని అతిథులు ప్రారంభించారు. బ్లడ్ డొనేషన్ చేసిన పలువురికి సర్టిఫికెట్ల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, పలువురు విద్యా వేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *