రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య హేతుబద్ధీకరణ కలిగి ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందుకు సంబంధించి రాజకీయ పార్టీలు తమ వంతుగా సహకారం అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లోనీ స్థానిక డీ ఆర్ వో ఛాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డి ఆర్వో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 1581 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో 1168 కేంద్రాల్లో 1200 మందికి కంటే తక్కువ ఓటర్లు ఉండగా, మిగిలిన 413 పోలింగ్ కేంద్రాల్లో 1200 పైబడి ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. వీటిని హేతుబద్ధీకరణ ప్రక్రియ ద్వారా సమాంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఇది నెల రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కోసం రాజకీయ పార్టీల సూచనలు సలహాలు స్వీకరించడం జరుగుతోందన్నారు. జిల్లాలో 16,21,164 మంది ఓటర్లు ఉండగా వాటిలో పురుషులు 7,91,179, మహిళలు 8,29,889 మంది, ఇతరులు 96 మంది ఉన్నారని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో రాజకీయ పార్టీ ప్రతినిధులు అప్ కె.సంతోష్ కుమార్, వైఎస్సార్ సీపీ టి.దేవదానం , సిపిఐ ఎమ్ పి.రామకృష్ణ, టిడిపి ఎం.శివ సత్యప్రసాద్, డిప్యూటీ తహసిల్దార్ శాస్త్రి , సహాయకులు అప్పారావు లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *