Breaking News

పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండకూడదు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా వై విరో హాస్పిటల్ రోడ్, ఎమ్ జి రోడ్, ఎయిర్పోర్ట్ కారిడార్, రామవరప్పాడు రింగ్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలని, ముఖ్యంగా డివైడర్ల వద్ద పేరుకుపోయిన మట్టిని ఎప్పటికప్పుడు తొలగించాలని, నగర శివారులైన, గన్నవరం పంచాయతి సిబ్బందితో సమన్వయపరుస్తూ పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి అని, అధికారులందరూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని అన్నారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్స్ ప్రాజెక్ట్స్ పి. సత్య కుమారి, పి. సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *