నూజివీడు, అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా నూజివీడులో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆధ్వర్యంలో గురువారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మృతులకు సంతాపం తెలియజేశారు.ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులు దాడిలో మరణించిన అమరులకు నూజివీడు మండలం యనమదల గ్రామంలో భారీ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఘన నివాళులు అర్పిస్తూ, ఉగ్రవాదుల దాడిని రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి అమానుషమని, దేశమంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రదాడిలో పర్యాటకులు మృతి చెందడం విచారకరమని పేర్కొన్నారు. దాడుకు పాల్పడిన ఉగ్రవాదులపై ప్రధాని మోడీ ఉక్కుపాదం మోపుతారని అన్నారు. దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News