విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో జనగణన లో బి సి కుల గణనను చేపట్టెందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల చేతి వృత్తి దారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి, రాష్ట్ర కార్యనిర్వాహాక అధ్యక్షులు సి. లింగమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామాంజనేయులు ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేశారు.గత 10 సం. రాలుగా కుల గణన ను చేపట్టాలని ప్రతి పక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి తెస్తున్నప్పటికి కుల గణన న ను చేపడితే సమాజం లో విభజన వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా వ్యతిరేకించారు. బీహార్ లో ఆర్ జె డి తో కలిసి వున్నపుడు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బి సి కులగణనను చేపట్టి వివరాలు వెల్లడించగా తెలంగాణ లో అధికారం లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణనను చేపట్టి వివరాలు ప్రకటించారు. కర్ణాటక లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య కులగణన సర్వే ను ఆమోదించారు.ఇప్పటి దాక మొండిగా తిరష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆలస్యం గా నైనా అంగీకరించడం స్వాగతించాల్సిన విషయం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం కుల గణనను చేపట్టాలి.తమ ప్రభుత్వం బి సి ల ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రక్క రాష్ట్రం తెలంగాణా లో ప్రభుత్వం బి సి ల కులగననను చేపట్టి వివరాలు వెల్లడించినా నరేంద్ర మోడీ కి భయపడి ఈ అంశం పై స్పందించలేదు. ఇప్పటికయినా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా బి సి కుల గణనను చేపట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని చేతి వృత్తి దారుల సమాఖ్య ఎపి రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నదని సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు సి. లింగమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామాంజనేయులు ఒక ప్రకటన లో తెలిపారు.
Tags vijayawada
Check Also
ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్
-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …
Prajavartha Online Telugu News