విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు లో గల ఆంధ్రప్రదేశ్ గొర్రెల మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ నందు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక సీనియర్ అకౌంటెంట్ పోస్టు నియామకానికి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నామని మేనేజింగ్ డైరెక్టర్ డా. పి. సత్య కుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్ పద్దతిలో సీనియర్ అకౌంటెంట్ పోస్టుకు అర్హత గల అభ్యర్ధులు ఈ నెల 03-05-2025 నుండి ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవడానికి అనుమతించడమైనదన్నారు. ఈ నెల 13 వ తేదీ లోగా అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చునని లేదా స్వయంగా ధరఖాస్తులను అందించే అభ్యర్ధులు మే 13 వ తేదీ సాయంత్రం 4 గంటల లోగా తమ ధరఖాస్తులను మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ గొర్రెల మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్, వెటరనరీ క్లినిక్ క్యాంపస్, కొత్త పేట, గుంటూరుకు అందజేయవచ్చునన్నారు.
ఈ పోస్టుకు బీ కామ్ డిగ్రీ లేదా ఎం కామ్ పీజీ విద్యార్హత కలిగి ఉండాలని, వయస్సు 25 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు కలిగి ఉండాలని, వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్ధులకు 3 సంవత్సరాలు సడలింపు కలదన్నారు. ఈ పోస్టుకు రూ. 21,000 గా నెలకు జీతంగా అందించనున్నారన్నారు. ఏదైనా సంస్థలో 2 లేదా 3 సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం ఉండాలని, ధరఖాస్తు రుసుం గా రూ. 50 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు https://www.apsheepfed.com ఈ వెబ్ సైట్ ద్వారా గాని, మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ గొర్రెల మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్, వెటరనరీ క్లినిక్ క్యాంపస్, కొత్త పేట, గుంటూరుకు- 522001, గాని వారి కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చునన్నారు. ఈ ఫోన్ నెంబర్లకు 0863- 2223356, 7288828773 కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చునని మేనేజింగ్ డైరెక్టర్ డా. పి. సత్య కుమారి ఆ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News