Breaking News

లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

-ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపివేయాలి
-నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి
-పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి.
-మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
-రాష్ట్ర సదస్సులో వక్తలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్మికచట్టాల స్థానంలో కేంద్రప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్స్ ని తక్షణం రద్దు చేయాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, కనీస వేతనం ₹26,000/- చెల్లించాలని, కనీస పెన్షన్ ₹10,000/- చెల్లించాలని, ప్రభుత్వరంగ సంస్థలలో తక్షణం రిక్రూట్మెంట్ చేపట్టాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని మధ్యతరగతి ఉద్యోగుల రాష్ట్ర సదస్సు డిమాండ్ చేసింది. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ప్రైవేటీకరణ విధానాలు రద్దు చేయాలని , ఇతర కార్మిక డిమాండ్లతో వచ్చే నెల 20వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వహించే కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.

విజయవాడ, గవర్నర్ పేట లోని బాలోత్సవ భవన్ లో “మధ్యతరగతి ఉద్యోగుల రాష్ట్ర సదస్సు” శనివారం జరిగింది. ఈ సదస్సుకు మధ్యతరగతి ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక, రాష్ట్ర కన్వీనర్, ఆర్.అజయ్ కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ కరోనా సమయంలో పార్లమెంట్లో ఎటువంటి చర్చ లేకుండా కేంద్రం నాలుగు లేబర్ కోడ్లను దొడ్డిదారిన తీసుకువచ్చిందన్నారు. కార్పొరేట్ సంస్థలకు లాభాలు అందించేందుకు కార్మిక చట్టాలను రద్దుచేసి, ఆ స్థానంలో లేబర్ కోడ్లను తీసుకొచ్చేందుకు పాలక వర్గాలు ప్రయత్నం చేశాయని చెప్పారు. లేబర్ కోడ్లు అమలులోకి వస్తే ఇప్పుడున్న అనేక హక్కులను కార్మికులు, ఉద్యోగులు, కోల్పోవాల్సివస్తుందన్నారు.

బ్యాంక్ ఉద్యోగ సంఘం ఎఐ బి ఇ ఎ రాష్ట్ర నాయకులు వై శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ ఆర్ధిక వ్యవస్థ ఛిన్నా భిన్నం కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు కృషి చేశాయని చెప్పారు. అలాంటి వాటిని దెబ్బ తీయాలని విలీనాలు చేశారన్నారు. పని భారం పెరిగిందని, వినియోగదారులకు అందించే సేవలపై ప్రభావం ఉందని తెలిపారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, సంయుక్త కార్యదర్శి, జి.కిషోర్ కుమార్ మాట్లాడుతూ, లేబర్ కోడ్స్ అమలు వల్ల కార్మికులు వెట్టిచాకిరి చేయాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. ఉద్యోగ భద్రత, ఇఎస్ఐ, కనీస వేతనాలు, పోరాడే హక్కులు కోల్పోతారని చెప్పారు. కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కుంటుపడి, కుటుంబాలు వీధినపడతాయన్నారు. బీమా రంగంలో సంస్కరణలు పట్టాదారులకు నష్టం చేశాయన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నూరు శాతం ఆమోదింతటం, బీమా చట్ట సవరణలు వ్యతిరేకిస్తూ సమ్మె లో పాల్గొంటున్నామని తెలిపారు.

బెఫి నాయకులు ఎస్ వి రమణ “మే 20న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెకు సంబంధించిన డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సమ్మె జయప్రదం చేసేందుకు చేపట్టాల్సిన ముందస్తు కార్యక్రమాలను వివరించారు. వీటిని సదస్సుకు హాజరైన మధ్యతరగతి ఉద్యోగుల సంఘాల నాయకులు, ఉద్యోగులు, కార్మికులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకులు ఎల్ కృష్ణ బాలాజీ, విద్యుత్ సంఘం రాష్ట్ర నాయకులు ఎల్ రాజు, బ్యాంక్ అధికారుల సంఘం రాష్ట్ర నాయకులు కె ఎ బి ఎల్ నర్సింహం, బీమా ఉద్యోగ సంఘం నాయకులు సి హెచ్ కళాధర్ సదస్సులో పాల్గొన్నారు.
తొలుత పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు.

ఈ సదస్సులో AIBEA, AIBOA, AIIEA, BSNLEU, NFTE, NFPE, AILICEF మరియు సోదర సంఘాల సభ్యులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *