Breaking News

దేశానికి గొప్ప భావితరాలను అందించే బాధ్యత, అదృష్టం తల్లికె దక్కుతుంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్, చైర్మన్, ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి గుంటూరు జిల్లాలోని, చేబ్రోలు లో మదర్స్ డే సందర్భంగా ఒక ప్రకటన చేస్తూ, దేవుని ప్రేమ తర్వాత, తల్లి ప్రేమ చాలా గొప్పదని, బిడ్డని తన పేగు బంధంతో నవ మాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి, చనుబాలుగా మారిన తన రక్తాన్ని పంచుతూ, తాను చేసిన త్యాగానికి ఏమి ఆశించకుండా బిడ్డను పెంచి, పెద్ద చేసి ప్రయోజకుడుక చేయటంలో అమ్మ పాత్ర చాలా గొప్పది, ఇలాంటి తల్లులు సన్మానానికి అర్హులు. అయితే అత్యధిక నవతరం తల్లులు ఉద్యోగ, వ్యాపార ల ఒత్తిడి కారణంగా, తల్లులలో ఓర్పు, సహనము, త్యాగము లోపిస్తున్నాయి, తల్లి ప్రేమకు ఏ ప్రేమ సాటి కాదు, అమ్మమ్మ, తాతలు, హెల్పర్స్ ఎవరైనా సరే, తల్లికి సాటి రారు. పిల్లలు బ్రెయిన్ డెవలప్ అయ్యే మొదటి ఐదు సంవత్సరాలలో తల్లుల ప్రేమ, అనురాగాలకు దూరమవ్వడం, ఎలక్ట్రానిక్ పరికరాలు మొబైల్, టీవీలు ఎక్కువగా చూడటం వల్ల చాలామంది పిల్లలు ఆటిజం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ (ADHD) కి చాలామంది గురువుతున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు కంటే తల్లికి పిల్లల పెంపకమే ముఖ్యంగా ఉండాలి, పిల్లలను పెంచుకోవడానికి అనుకూలంగా ఉండే పార్ట్ టైం ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటే మంచిది అని ప్రొఫెసర్ జోసఫ్ మోసిగంటి సూచించారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే, తమ పిల్లలు కొంచెం పెద్ద అయ్యే వరకు, వారు దేశానికి పేరు తెచ్చే, గొప్ప నాయకులుగా, పౌరులుగా తయారుచేసే బాధ్యత తల్లి తీసుకుంటే దానికి మించిన సేవ లేదు. అనేకమంది గొప్పవారుగా కావడానికి కారణం వారి తల్లులే, అదే సమయంలో తమ అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని సొంత బిడ్డలను అంతమొందించే కర్కస తల్లులు లేకపోలేదు. అందుకే ఒక సామెత చెప్తారు, పెళ్లి చేసుకునేటప్పుడు మంచి భార్యను మాత్రమే కాకుండా మంచి తల్లిగా విధులు నిర్వర్తించే అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటే మంచిదని,
ఒక్క తల్లి సమర్థురాలు అయితే వచ్చే తరాలు సమర్థులుగా ఉంటారు. అందుకే స్త్రీలు చదువుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, సమర్థులుగా ఉండాలి అని ప్రభుత్వాలు స్త్రీలను అన్ని రంగాలలోనూ ప్రోత్సహిస్తున్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *