Breaking News

రూ.304 లక్షలతో 33/11 కేవి విద్యుత్తు ఉప కేంద్రానికి శంఖుస్థాపన

అచ్చంపేట, నేటి పత్రిక ప్రజావార్త :
పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలో రూ.304 లక్షలతో 33/11 కేవి విద్యుత్తు ఉప కేంద్రానికి మంగళవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, శాసనమండలి సభ్యులు కర్రి పద్మశ్రీ, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప, కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ పెద్దాపురం శాసనసభ్యులు చినరాజప్ప తన నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ది చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలకు విస్తృత అవకాశాలు కల్పిస్తుందని పారిశ్రామిక, వ్యాపార అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నాంమన్నారు. ఖాళీ స్థలాలను జగన్ కబ్జా చేస్తే… కూటమి ప్రభుత్వం పారిశ్రామిక వాడలను నిర్మిస్తుందని మంత్రి తెలిపారు. జగన్ అధికారాన్ని స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటే..కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం లక్ష్యంగా పని చేస్తోందన్నారు. పేదోడి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను పునరుద్ధరించా మన్నారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నాం మంత్రి లోకేష్ నాయకత్వంలో నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీకి ప్రకటించామని, వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంతో కాలం గడిపారని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఏటా విద్యుత్ వినియోగం ఆరు నుంచి ఎనిమిది శాతం పెరుగుతుందని, రాష్ట్రంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామాలకు 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన విద్యుత్తు సబ్ స్టేషన్లను అవసరం ఉన్నచోట ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో సంబంధించి వివిధ గ్రామాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కార నిమిత్తం ఎమ్మెల్యే చినరాజప్ప తన దృష్టికి తీసుకు వచ్చిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజా, ఏపీఈపీసీఎల్ ఎస్ఈ జి.ప్రసాద్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *