జిల్లా లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా నిర్వహిస్తు న్న స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం

-ప్రతినెలా మూడోవ శనివా రం స్వచ్చంధ్ర – స్వర్ణాంధ్ర కా ర్య క్ర మం నిర్వహిస్తున్నాం
-మే నెల కాన్సెప్ట్ బీట్ హిట్ నేపథ్యంలో “నీరు – మీరు” కార్యక్రమం
-డిఆర్ఓ, టి సీతారామ మూర్తి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛత, పచ్చదనం పెంపొం దించే విధంగా చర్యలు తీసు కుంటున్నామని డిఆర్ఓ, టి సీతారామ మూర్తి అన్నారు.
రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ప్రతి నెల 3 శనివారం నిర్వహిం చే కార్యక్రమంలో భాగంగా బీట్ ద హీట్ థీమ్ తో జరిగిన కార్య క్రమంలో డిఆర్ఓ పాల్గొని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. ఈ సందర్భంగా సీతారామమూర్తి మాట్లాడు తూ ఎండ వేడిని తగ్గించే విధం గా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ప్రజలు ఎండల తీవ్రతకు గురికాకుండా ముం దస్తు జాగ్రత్త చర్యలు తీసుకో వాలని సూచించారు. పశు పశ్యాదులను రక్షించే విధంగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకో వాలని తెలిపారు.

వేసవికాలం దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ప్రతి రహదారి మా ర్గంలో, పల్లె ల్లో , ప్రధాన కూడ ళ్లలో త్రాగు నీరు అందుబాటు లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

వేసవి ఉష్ణోగ్రతలు పెరిగే అవ కాశం ఉందని, ఇందు కోసం ప్రజలకి ఎక్కడికక్కడ చల్లని త్రాగునీటి సరఫరా, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించా లన్నారు. వేసవి దృష్ట్యా షేడ్స్, త్రాగునీరు, మెడికల్ శిబిరాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్ర మాలు చేపట్టామన్నారు. పశుపక్ష్యాదుల కోసం నీటి తొట్టెలను ఏర్పాటు చేసా మన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే నేపధ్యంలో వృద్ధులు, చిన్నారుల విష యంలో తగిన జాగ్రత్తలు తీసు కోవాల్సి ఉందని, అందులో భాగంగా ప్రత్యేక అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టా మని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూ ఎస్, ఎస్. ఈ, బి. వెంకట గిరి, ఆర్డబ్ల్యూఎస్ డీఈలు, టి. శ్రీని వాస బాబు, పి. శ్రీనివాస్, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, జ్యోతి, జెడి వ్యవసాయ శాఖ, మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *