అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘సీబీఎన్ పాత్ వేస్ టు సక్సెస్’ అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు 75 ఏళ్ల జీవిత ప్రస్థానాన్ని గురించి వివరిస్తూ ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి డి. రాజేష్ కుమార్, రీచ్ ఎయిట్స్ ఈటీ & సీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ డీ.ఏ.రాజు సంయుక్తంగా ఈ పుస్తకాన్ని రచించారు. దీనిని సచివాలయంలో సోమవారం సీఎం ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో సీఎం చంద్రబాబు జీవితాంశాలు, విజన్, విజయ సూత్రాలు, అభివృద్ధి విధానాలు వంటి వివిధ అంశాలను గురించి పొందుపరిచారు. సీఎంను కలిసిన వారిలో వీఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ బన్ బాబు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News