తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సత్యవేడు నియోజకవర్గం, సత్యవేడు మండలంలోని ఓబులురాజు ఖండ్రిగ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, సత్యవేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకు గ్రామస్థులు హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సంప్రదాయ పద్ధతిలో పౌరోహితులు పూజలు నిర్వహించి హారతి, తీర్థ ప్రసాదాల అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు బీరేంద్ర వర్మ, సుశీల్ కుమార్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు వేలూరు రాకేష్, రమేష్ రెడ్డి మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News