ఘనంగా నూజివీడులో మినీ మహానాడు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
నూజివీడు ఏలూరు జిల్లా మినీ మహానాడుకు వేలాదిగా తరలివచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలు కేరింతల నడుమ హట్టహాసంగా ప్రారంభం మంత్రి కొలుసు పార్థసారధి జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు అనంతరం సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ టీడీపీ బలం కార్యకర్తలే..దేశంలో మరెక్కడా లేని క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ అని తల్లి లాంటి భువనేశ్వరి పార్టీ కార్యకర్తల పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు.. నన్ను అక్కున చేర్చుకున్న నూజివీడు టీడీపీ కార్యకర్తల కు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అన్నారు గత ప్రభుత్వం టీడీపీ, జనసేన కార్యకర్తలను ఉక్కుపాదంతో తొక్కేసే ప్రయత్నం చేసింది.వై నాట్ 175 అని అహంకారన్నీ ప్రజలు తొక్కేసారు..గత ప్రభుత్వం లో పని చేయడం పట్ల సిగ్గుపడుతున్నాను.తెలుగు ప్రజలు స్వార్థపరులు కాదు త్యాగధనులు అని ఎన్నికల్లో నిరూపించారు.కూటమి అధికారంలోకి వచ్చే నాటికి 10 లక్షల కోట్లు అప్పు ఉందని చంద్రబాబు అనుభవమే ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి లో ముందుకు తీసుకువెళుతున్నారని. కూటమి ఉచిత డబ్బులు ఇవ్వడం లేదు కానీ అంతకు మించి అధివృద్ధి ఇస్తోంది. గ్యాస్, పింఛన్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అందిస్తున్నాము.క్వాంటం వాలి రాష్ట్రంలో కొత్త విప్లవం తీసుకువస్తుంది. గత ప్రభుత్వం లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాకుండా పారిపోయారు. నేడు ఏపీకి ప్రపంచ స్థాయి పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారు. ఓటు వేసిన వ్యక్తులకు గౌరవం ఇవ్వాలి గత సీఎం చేసిన తప్పు తాను చక్రవర్తిలా ఉహించుకొని అహంకారం పెంచుకున్నారు. కార్యకర్తలలో చిన్నచిన్న లోపాలు ఉన్న మనమే సర్దుకుందాము కానీ పార్టీకి నష్టం చేసేలా ఉండకూడదు. రాబోయే 10 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎం ఎల్ ఏ రోషన్,ఎమ్మెల్సీ ఆలపాటి రాజా,ఎం ఎల్ ఏ బండేటి చంటి,ఆప్కోబ్ చైర్మన్ గన్ని రామఆంజనేయులు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *