Breaking News

ఎం.ఎల్. ఎస్ పాయింట్ గొడౌన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్

వాకాడు, నేటి పత్రిక ప్రజావార్త :
వాకాడు నందు ఎం.ఎల్. ఎస్ పాయింట్ గొడౌన్ ను గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలసి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్. వాకాడు నందు గల ఎం.ఎల్. ఎస్ పాయింట్ గొడౌన్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తో కలిసి గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

కలెక్టర్ మాట్లాడుతూ వాకాడు నందుగల ఎంఎల్ఎస్ పాయింట్ గోడౌన్ నుండి 3 మండలాలకు నిత్యావసర సరుకులు సరఫరా అవుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ఎమ్ ఎల్ ఎస్ పాయింట్ నందు అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులు, ఆరోపణలు రావడంతో ఆకస్మికతనిఖీ చేయడం జరిగిందని తెలిపారు.ఈ క్రమంలో గోదాములోని బియ్యం, పంచదార ఇతర సరుకులను పూర్తిగా పరిశీలించామని అలాగే రికార్డులను అన్నిటిని చూడడం జరిగిందని తెలిపారు. చాలా కాలంగా గోడౌన్లో నిల్వ వున్న కందిపప్పు గురించి వివరణ కోరగా వాటికి ప్రభుత్వం నుండి అనుమతి రాలేదని అందువల్ల స్టాక్ లో ఉన్నాయని గోడౌన్ ఇంచార్జ్ వెంకటేశ్వరరావు తెలియపరచారని తెలిపారు.

ఈ క్రమంలో గోడౌన్ నందు అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నందున గోడౌన్ ఇన్చార్జి వెంకటేశ్వరరావు పై విచారణ కు ఆదేశించామని విచారణలో పొరపాట్లు జరిగినవి అని రుజువు అయితే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత సివిల్ సప్లై అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *