Breaking News

రాబోయే 36 గంటల్లో వాయుగుండం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని ఇది రాబోయే 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

మంగళవారం(27-05-25) నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది ఆతదుపరి రెండు రోజుల్లో బలపడే అవకాశం ఉందన్నారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

దీని ప్రభావంతో రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతో పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు. పిడుగులతో కూడిన వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

శుక్రవారం(23-05-25) అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం,ఏలూరు,ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

శనివారం(24-05-25) అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, నెల్లూరు, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

గురువారం సాయంత్రం 6 గంటల నాటికి పల్నాడు జిల్లా కాశిపాడు 29.5మిమీ, విజయవాడ తూర్పులో 25.5మిమీ, కర్నూలు జిల్లా దేవనబండలో 22.5మిమీ, విజయనగరం జిల్లా విజయరాంపురంలో 18మిమీ, కాగంలో 17మిమీ వర్షపాతం రికార్డయిందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *