గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా మంగళవారం (27వ తేదీ) ఉదయం 7 గంటలకు బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియం నుండి లక్ష్మీపురం మధర్ థెరిస్సా విగ్రహం వరకు ర్యాలీ జరగుతుందని, ర్యాలీలో జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొంటారని, నగరంలోని యువత, సీనియర్ సిటిజన్స్, విద్యార్ధులు, స్వచ్చంద సంస్థలు పాల్గొని విజయవంతం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుండి జూన్ 21 వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2025లో గుంటూరు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనెలా అవగాహన కల్గించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే వార్డ్ సచివాలయాల వారీగా యోగంధ్ర వెబ్ సైట్ లో యోగా పై ఆసక్తి కల్గి, దేశ ప్రధాని పాల్గొనే వైజాగ్ లో జరిగే సదస్సు కు వెళ్ళాలనుకునే వారి రిజిస్ట్రేషన్ చేస్తున్నామని తెలిపారు. మంగళవారం జరిగే ర్యాలీలో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Prajavartha Online Telugu News