పేద ప్రజల కళ్లలో సంతోషమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

-ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో సామాజిక భద్రత
-నిడదవోలు పట్టణంలోని 4,8 వార్డుల్లో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్
-ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ చేయడంపై లబ్ధిదారులు హర్షం
-జూన్ లో పాఠశాలలు తెరిచే నాటికి తల్లికి వందనం, ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేస్తామని వెల్లడి
-ప్రభుత్వ పనితీరు విషయంలో ప్రజల సంతృప్త స్థాయి పెరిగిందని స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లతో నిరుపేదలకు భరోసా అందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం నిడదవోలు పట్టణంలోని 4,8 వ వార్డుల్లో పర్యటించిన మంత్రి దుర్గేష్ ఇంటింటికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్త స్థాయిని అడిగి తెలుసుకున్నారు. సంతృప్త స్థాయి పెరగడానికి ఇచ్చిన హామీల అమలు చేయడమే కారణమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. జూన్ 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ చేపట్టామన్నారు. ప్రజల సామాజిక భద్రత కూటమి ప్రభుత్వ బాధ్యత అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సకాలంలో అందిస్తున్న వివిధ రకాల పెన్షన్లు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.గత ప్రభుత్వం చాలీచాలని పెన్షన్లు అందిస్తే సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో అవ్వాతాతలకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.15,000 అందిస్తూ భరోసా కల్పిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రూ.2000 పెన్షన్ ను రూ.3000 చేయడానికి 5 ఏళ్ల సమయం తీసుకుంటే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ ను రూ.4000కు పెంచి ఇంటి వద్దనే అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఖజానాను పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిందని అయినప్పటికీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా వాటిని లెక్కచేయకుండా పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నామన్నారు. నాడు కొందరు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటింటికి పెన్షన్ అందివ్వరని దుష్ప్రచారం చేశారని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ -6 హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పాఠశాలలు తెరిచే నాటికి తల్లికి వందనం, ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేస్తామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *