పెద్దాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం పెద్దాపురం లో నిర్వహించిన పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజా క్షేమమే లక్ష్యంగా నిలబడతారు. పార్టీ కోసం నిలిచిన కార్యకర్తల్ని, నాయకుల్ని ఎన్నడూ మరచిపోరు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ ఎంతో శ్రమించారు. ప్రజలు కూటమి పట్ల ఎంతో విశ్వాసం కనబరిచారు. వారి విశ్వాసాన్ని నిలబెట్టుకునే దిశగా వెళ్తున్నాం. రేషన్ షాపులు తిరిగి ప్రారంభిస్తున్నాము. కార్డుదారులకి మెరుగైన సేవలు అందిస్తాము” అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, కాకినాడ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News