సోమవారం జూన్ 2 వ తేదీన యధావిధిగా పిజిఆర్ఎస్

-పిజిఆర్ఎస్ లో అందచేసిన అర్జిల పరిష్కార స్థాయి 1100 డయల్ చేసి తెలుసుకోవచ్చు
-అర్జీలు meekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకునే అవకాశం
-వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009  మీ సెల్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకోవాలి
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలు పరిష్కార  కోసం  జిల్లా, డివిజన్ మండల స్థాయి లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ జూన్ 2 వ తేదీ సోమవారం రోజున యధావిధిగా నిర్వహిస్తున్నట్లు, వాట్స్ అప్ గవర్నెన్స్ ద్వారా నేరుగా అర్జీ దాఖలు చేసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు.

ప్రజలు తమ అర్జీలను ఇవ్వడం కోసం “1100 – మీకోసం కాల్ సెంటర్” కు ఫోన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయుటకు అవకాశం ఉంటుందని తెలియ చేశారు. అదే సమయంలో నమోదైన మీ అర్జీ యొక్క పరిష్కార స్థితిగతులు తెలుసుకో వచ్చునని ఆమె తెలిపారు. అర్జీలు పరిష్కారం కోసం అర్జీదారులు meekosam.ap.gov.in  వెబ్సైట్ నందు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. నేరుగా అర్జీలు ఇవ్వలేని వారు మీ కోసం వెబ్ సైట్ లో ఆన్‌లైన్‌ ద్వారా మీ ఫిర్యాదు నమోదు చేయవచ్చు అని తెలియ చేశారు.

జిల్లా కలెక్టరేట్లో అదే విధంగా డివిజన్, మునిసిపల్ ,  మండల కేంద్రంలో జూన్ 2 ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ప్రజల నుంచి పీజీఆర్ఎస్ అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక అధికారులు , జిల్లా, డివిజన్ మండల, మునిసిపల్ క్షేత్ర స్థాయి అధికారులు తప్పనిసరిగా హజరు కావాలని స్పష్టం చేశారు.

ప్రజలు వ్యయ ప్రయసలుపడి ప్రభుత్వ కార్యాలయాలకు వొచ్చి ఫిర్యాదు చెయ్యకుండా “1100” టోల్ ఫ్రీ నెంబర్ కు నేరుగా తమ సమస్యలను తెలియ చేయడం ద్వారా , గతంలో అందచేసిన అర్జిల స్థాయి కూడా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. సత్వర పౌర సేవలను పొందేందుకు 9552300009 ఈ గవర్నెన్స్ ను తమ సెల్ ఫోన్లలో  నిక్షిప్తం చేసుకోవాలని జిల్లా ప్రజలకి కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *