కోకో రైతులు నుంచి ప్రతి గింజ కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధం

-రైతుల వద్ద ఉన్న స్టాక్ వివరాలు సర్వే చేయడం జరుగుతుంది … కలెక్టర్ ప్రశాంతి
-మద్దూరు, కోరుమామిడి గ్రామాల్లో కలెక్టర్ పర్యటన
-కోకో రైతులతో అధికారులతో కలిసి ముఖాముఖి

కొవ్వూరు/ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
» వాస్తవ రైతుల నుంచే కోకో గింజల సేకరణ కోసం తహసిల్దార్, ఉద్యానవన అధికారులతో కూడిన ఒక ప్రత్యెక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. సోమవారం సాయంత్రం కొవ్వూరు మండలం మద్దూరు, నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామాల్లో ఆర్డీవో రాణి సుస్మిత, ఏపీఏంఐపి పిడి ఏ.. దుర్గేష్, జిల్లా హార్టికల్చర్ అధికారి బి సుజాత కుమారి లతో కలిసి కలెక్టరు పర్యటించి, కోకో రైతులతో ముఖాముఖి సంభాషించడం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో  కోకో రైతుల వద్ద ఉన్న ప్రతి గింజ కొనుగోలు చేయనున్నట్లు , ఇందు కోసం ఉద్యానవన , రెవెన్యూ అధికారులతో కూడిన ఒక బృందం సభ్యులతో ప్రతి కోకో రైతు వద్ద ఉన్న పంటను సర్వే చేసి, ఆమేరకు కొనుగోలు రైతుల వద్ద ఉన్న సరుకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  వాస్తవ సాగు దారుల నుంచి కోకో దిగుబడులను ఈ నెలాఖరు లోపు సేకరించనున్నట్లు తెలిపారు.  కిలో రూ.500 చొప్పున రైతుకు ధర చెల్లిస్తే,  ప్రభుత్వం రూ.50 చొప్పున కంపెనీలకు రీయింబర్స్మెంట్ చేస్తుందని పేర్కొన్నారు.    మిగిలిన సరుకును ఈ 30వ తేదీలోగా సేకరించాలని టార్గెట్ పెట్టినట్లు ఆమె తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *