తెనాలిలో మధ్యాహ్న భోజన పథకం పరిశీలన

-రూ. 474 కోట్ల అభివృద్ధి, సంక్షేమం – ఏడాది పాలనకు దిగ్విజయ ముగింపు
-కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ ధన్యవాదాలు

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, “మార్పు కోసం ధైర్యంగా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుై ఏడాది పూర్తయిన సందర్భంగా తెనాలిలోని మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జనసైనికులు, వీర మహిళలు, కూటమి నాయకులు పాల్గొని టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ కూటమి నాయకులు, అధికారులతో కలిసి గడిచిన ఏడాది కాలంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.

తెనాలి నియోజకవర్గానికి రూ. 74 కోట్లు అభివృద్ధి పనులకు ఖర్చు, సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం రూ. 400 కోట్లు కేటాయింపు, తెనాలి పట్టణ అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన ముందుగామి చర్యలు, నారకోడు – తెనాలి – మంగళగిరి రోడ్ అభివృద్ధి పనులు ప్రారంభం, రైతులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం, సంక్షేమ పాలన – సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం “ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా, ప్రతి వర్గానికీ న్యాయం చేయాలనే లక్ష్యంతో” పాలన కొనసాగిస్తోందన్నారు. ప్రజలు చూపిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అభివృద్ధి మార్గంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే కూటమి ధ్యేయమని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

మధ్యాహ్న భోజన పథకం పరిశీలన
ఈ సందర్భంగా తెనాలి చెంచు రామానాయుడు హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి పరిశీలించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారి అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. “పిల్లలకు పోషకాహారంతో కూడిన నాణ్యమైన బియ్యం అందించాలనే సంకల్పంతో 25 కిలోల రేషన్ సంచిలో అర కిలో ఫోర్టిఫైడ్ బియ్యం మిశ్రమం ఇవ్వాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *