రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
యోగా ఆంధ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో, సమన్వయం చేసుకోవడం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ లతో యోగాంధ్ర కార్యక్రమం ప్రజల్లోకి విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడం పై గత 30 రోజులుగా చేపడుతున్న ప్రక్రియ చివరి దశకు చేరుకోవడం, రానున్న రెండు రోజులు మరింత సమర్థవంతంగా సమన్వయం చేసుకోవడం పై దిశా నిర్దేశం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో యోగా ఆంధ్రా సాధన కార్యక్రమం లో 7,71,000 మందిని భాగస్వామ్యం చెయ్యాలని లక్ష్యం నిర్దేశించగా 8,61,979 మంది వారి పేర్లు నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో 4,400 మంది యోగా శిక్షకులు గా పేర్లు నమోదు చేసుకోవలసి ఉండగా 5, 567 మంది నమోదు చేసుకున్నట్లు తెలిపారు. జిల్లా, నియోజక వర్గం, మండల, గ్రామ, సచివాలయాల పరిధిలో వేడుకగా యోగా సాధన కార్యక్రమం నిర్వహించడం కోసం ప్రత్యేక అధికారులు, ఇతర క్షేత్ర స్థాయి అధికారులను, అన్నీ ప్రభుత్వ, ప్రవేటు విద్యా సంస్థలను సిద్ధం చేశామన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి, సిపిఓ జాయింట్ డైరెక్టర్ ఎల్ అప్పల కొండ, ఆయుష్ వైద్యులు డా. కె.సీహెచ్. రమేష్, ఆయుష్ నోడల్ అధికారి పి. కేజియా, డివిజనల్ అభివృద్ధి అధికారులు. పి వీణా దేవి, ఏ. స్లీవా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News