ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం : మల్లాది విష్ణు 

-ఎమ్మెల్యే  చేతుల మీదుగా రూ. 4.94 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే  కార్యాలయంలో 13 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 4.94 లక్షలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రి అయిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 731 మందికి రూ. 3 కోట్ల 47 లక్షల 46 వేల 35 రూపాయలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. గతంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ విషయంలో చాలా అలసత్వం ఉండేదని.. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందన్నారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  అధికారంలోకి వచ్చిన రెండేళ్లల్లో వైద్య రంగానికి కేటాయింపులు పెంచార‌ని మల్లాది విష్ణు తెలిపారు. నియోజకవర్గంలో దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ మంజూరవుతున్నదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి  చేస్తున్న మంచిపనులకు ప్రజలందరూ అండగా నిలబడాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *