వైభవంగా శ్రీ గాయత్రి మాత విగ్రహ ప్రతిష్ఠ… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-గాయత్రి సొసైటీ సేవలు అభినందనీయం… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం సీతన్నపేటలోని గాయత్రి కన్వెన్షన్ హాల్ నందు శ్రీ గాయత్రి మాత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా వేద మంత్రోచ్ఛరణల నడుమ కన్నులపండువగా జరిగింది. బుధవారం శ్రీ గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని.. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పౌరునికి సకాలంలో చేరాలని ఎమ్మెల్యే గారు వేడుకున్నాను. ఆ గాయత్రీమాత కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గాయత్రి సొసైటీ సేవలను కొనియాడారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 75 ఏళ్లు నిండిన బ్రాహ్మణ దంపతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గాయత్రి సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఈశ్వర్, జనరల్ సెక్రటరీ డాక్టర్ చల్లా హరికుమార్, సెక్రటరీ దోపుగుంట శ్రీనివాస్, కోశాధికారి జె.కె.సుబ్బారావు మరియు గాయత్రి సేవా సంఘం సభ్యులు సుధీర్, చాంద్, చల్లా సుధాకర్, కె.మారుతి, సనత్, కొండా, దోనేపూడి శ్రీనివాస్, ఎస్.శ్రీను, తాడంకి భాస్కర్, చామంతి మూర్తి, ఆకెళ్ల శ్రీను, ఏ.రామారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *