అంతర్గత రహదారుల అభివృద్ధి కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
గృహ నిర్మాణం చేపడుతున్న లే అవుట్ లలో అంతర్గత రహదారుల అభివృద్ధి కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. హౌసింగ్ డే ను పురస్కరించుకుని శనివారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఇతర అధికారులతో కలిసి వెలుగుబంద లే అవుట్, కానవరం, పల్లకడియం లలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేసే క్రమంలో లే అవుట్ లలో మౌలిక సదుపాయాలు కల్పన కోసం ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అందుకు సంబంధించి క్షేత్ర స్థాయి అధికారులకు సూచనలు చెయ్యడం జరిగింది. అంతర్గత రహదారుల అభివృద్ధి కోసం కావలసిన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. అందుకు సంబంధించి హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ నిధులు విడుదల కోసం ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఇన్చార్జి హౌసింగ్ పిడి ఎస్ భాస్కర్ రెడ్డి, అదనపు మునిసిపల్ కమిషనర్ ఆర్ వి రామలింగేశ్వర్, తహసిల్దార్ జిఎఎల్ఎస్ దేవి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *