ప్రతీ పాఠశాలలోను కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే… : కలెక్టర్ జె. నివాస్

-త్వరలో డివిజన్ స్థాయిలో ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అన్ని పాఠశాలల్లోను కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలతో పాఠశాలలు నిర్వహించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాధికారులను, ప్రధానోపాధ్యాయలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పాఠశాలలో కోవిడ్ నిబంధనలు మరింత పటిష్టంగా అనుసరించే విషయంపై త్వరలో డివిజన్ స్థాయిలో ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించనున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతోపాటు, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ వంటివి అనుసరించవల్సిందేనన్నారు. మరి ముఖ్యంగా మధ్యాహ్నం భోజన సమయంలో విద్యార్థులు ఒకే చోట గుమిగూడి ఉండకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రమంగా వుండేలా పర్యవేక్షించాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *