Breaking News

ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సుమారు రూ:31లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

-మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం రూ, వేల కోట్లు మంజూరు
-నిరుపేదల మెరుగైన వైద్యానికి గొప్ప వరం ముఖ్యమంత్రి సహాయనిది రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి
-నూజివీడు నియోజకవర్గంలో ఇటీవల వైద్యం చేయించుకున్న 49 మంది కి గాను సుమారు,రూ:30,24,224.లక్షల చెక్కులను అందజేసిన మంత్రి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల మెరుగైన వైద్యం కోసరం ప్రభుత్వం వేల కోట్లు కేటాయించిందని, అపత్కాలంలో ఉన్న నిరు పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి, అండగా నిలుస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు నియోజకవర్గంలో పట్టణానికి చెందిన 7 గురి కుటుంబాలకు గాను, రూ,6,08,832లక్షలు,నూజివీడు మండలంలో 9 మందికి గాను, రూ,3,87,505.లక్షల, ఆగిరిపల్లి మండలంలో 12 మంది బాధిత కుటుంబాలకు, రూ,8,00147.లక్షల, ముసునూరు మండలంలో 11 మంది బాధిత కుటుంబాలకు రూ,7,19,545.లక్షల. చాట్రాయి మండలంలో 4 కుటుంబాలకు, రూ,3,50,061.లక్షల, ఇతర ప్రాంత వాసుల 3 కుటుంబాలకు, రూ,1,58,134.లక్షల విలువైన చెక్కులను,బాధిత కుటుంబాలకు అందజేసిన మంత్రివర్యులు. పలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇటీవల వైథ్యం చేయించుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆర్జి పెట్టుకున్న 49మంది కుటుంబాలకు సుమారు, రూ:31లక్షల చెక్కులను బాధిత
కుటుంభాలకు
అందించిన మంత్రి కొలుసు పార్థసారధి,నియోజకవర్గానికి చెందిన పలువురు వైద్యం చేయించుకొని బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ చేసుకోగా నేడు బాధితులకు చెక్కులను అందజేశారు.
గతంలో వైద్యం చేయించుకున్న వారు కూడా వైద్యం చేయించుకున్న బిల్లులను మా కార్యాలయంలో అందజేస్తే ముఖ్యమంత్రి సహాయ నిధినుండి ఆర్ధిక సహాయం వెంటనే అందజేస్తానన్నారు.
మెరుగైన వైద్యానికి కూటమి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుందని ప్రజలంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలంతా మెరుగైన వైద్యాన్ని సద్వినియోగం చెసుకోవలన్నారు.
రాష్ట్ర మంత్రి పార్థసారథికి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆపదలో ఉన్న మా కుటుంబాన్ని దేవుడి లా ఆదుకొన్నారని ఇలాంటి మంత్రి కి జీవితాంతం రుణపడి ఉంటామని, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు, కుటుంబ సభ్యులు తమ హర్షాన్ని కృతజ్ఞతను తెలియజేసారు,ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *