త్వరితగతిన రివర్ ఫ్రంట్ పనులు పూర్తి చేయాలి

– సందర్శకులకు కావలసిన సౌకర్యాలు సమకూర్చాలనీ సూచన
– ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి , ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రివర్ ఫ్రంట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులు, కాంట్రాక్టర్ లకు సూచించారు. మంగళవారం ఉదయం గోదావరి గట్టున రూ. 8 కోట్లతో పూలే విగ్రహం దగ్గర నుంచి చేపట్టిన గోదావరి రివర్ ఫ్రంట్ పనులను నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా రివర్ ఫ్రంట్ నమూనాలను పరిశీలించి పలు సూచనలు, సలహాలు ఇచ్చి మార్పులు చేయాలని సూచించారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆహ్లాదకరంగా గడిపేలా రివర్ ఫ్రంట్ ను అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. గోదావరి గట్టున ఉన్న విగ్రహాలకు ఏం జరగకుండా పనులు చేయాలని సూచించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

ఈ సందర్శన లో ఈ ఈ మదర్సా అలీ, ఆర్ ఎమ్ సి అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *