రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీ లక్ష్మి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం, ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలకు అందిస్తున్న ఆహార ప్రమాణాలు, సదుపాయాలను సమీక్షించారు. ఖైదీలతో పాటు వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఖైదీల తరపున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, బెయిల్ పిటీషన్లు వేయాలన్నా, పైకోర్టుల్లో అప్పీలు చేయాలన్నా లేదా మరే ఇతర న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని ఆమె హామీ ఇచ్చారు. ఇందుకోసం పారా లీగల్ వాలంటీర్ల ద్వారా అర్జీలు సమర్పించాలని సూచించారు. అదేవిధంగా, ముద్దాయిలు మరియు ఖైదీలకు అందుబాటులో ఉన్న లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News